సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లను చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు - దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రాజెక్టు ఒకటి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. కాగా, 'ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ' అంటూ.. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ మూవీగా ఉంటుందని ఇదివరకే రాజమౌళి ఈ సినిమా గురించి హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా.. జూన్ 2023లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా త్వరలోనే పూర్తవుతుందని సమాచారం. ఇక నుంచి క్రమంగా సినిమా నటీనటులు, టెక్నీషియన్స్ గురించి సమాచారం వెల్లడించే అవకాశం ఉంది. ఈ సినిమా చిత్రీకరణ.. త్రివిక్రమ్-మహేశ్ సినిమా పుర్తైన తర్వాత మొదలు కానుందని తెలుస్తోంది.
రాజమౌళి-మహేశ్ బాబు మూవీ క్రేజీ అప్డేట్.. సినిమా ప్రారంభం అప్పుడే! - రాజమౌళి మహేశ్ బాబు సినిమా ప్రారంభ తేది
రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా గురించి సినీ ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా గురించి మరో అప్డేట్ వ్చచింది. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఎప్పుడంటే..
హీరోయిన్లపై ఊహాగానాలు..
ఈ సినిమాలో మహేశ్ సరసన నటించేందుకు హీరోయిన్లను వెతికే పనిలో పడింది మూవీ టీమ్. ఈ నేపథ్యంలో హీరోయిన్లపై చాలా ఊహాగానాలు వినబడుతున్నాయి. మహేశ్‌తో బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ఆడిపాడనుందని ఇదివరకే నెట్టింట్లో చర్చ జరిగింది. ఆ తర్వాత మాజీ విశ్వ సుందరి ఐశ్వారాయ్ నటించబోతుందని వార్తలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పఠాన్ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మూవీ టీమ్ స్పందిస్తేనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది.
కోలీవుడ్ విలన్.. హాలీవుడ్ హీరోలు..
ఈ సినిమాలో మహేశ్ బాబుకు బలమైన ప్రతినాయకుడి కోసం చిత్ర యూనిట్ గాలిస్తోంది. ఈ తరుణంలో కోలీవుడ్ స్టార్ హీరో.. మహేశ్‌తో తలపడబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఈ సినిమాలో అవెంజర్స్ హీరోలు కూడా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఎక్స్ఎక్స్ఎక్స్, కెప్టెన్ మార్వెల్, స్టార్ వార్స్, జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, కెప్టెన్ అమెరికా వంటి హిట్ చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు శామ్యూల్ ఎల్ జాక్స్‌తో పాటు అవెంజర్స్ థోర్ ఫేమ్ హీరో క్రిస్ హెమ్స్ వర్త్ తీసుకోబోతున్నట్లు సోషల్‌మీడియాలో జోరుగా ప్రచరాం సాగుతోంది. శామ్యూల్ కీలక పాత్ర పోషించబోతుండగా.. క్రిస్ అతిథి పాత్రలో కనిపిస్తారట. అయితే ఈ వార్తలో ఎంత నిజమున్నదో తెలియదు కానీ సినిమాపై అంచనాలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇది నిజంగా జరిగితే ఈ సినిమా రికార్డులు బద్దలుగొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.