తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హాలీవుడ్​లో 'ఆర్​ఆర్ఆర్'​కు మరో అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు సొంతం! - ఆర్ఆర్ఆర్ అవార్డ్స్

'ఆర్​ఆర్ఆర్'​ సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిభ కనబర్చిన హాలీవుడ్​ చిత్రాలకు ఇచ్చే ఓ ప్రతిష్టాత్మక అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకుంది.

rrr saturn awards
rrr saturn awards

By

Published : Oct 26, 2022, 3:04 PM IST

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఈ చిత్రానికి వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి వీడియో సందేశాన్ని పంపించారు. "బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరీలో మా సినిమా అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్‌ అందరి తరఫు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. 'బాహుబలి - 2' తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్‌ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నాలని అనుకున్నాను. అయితే.. మా సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానున్న సందర్భంగా ఆదేశంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందుకే రాలేకపోయాను. విజేతలందరికీ నా అభినందనలు" అని జక్కన్న పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ఫిక్షనల్‌ కథతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఇది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధానపాత్రలు పోషించారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈసినిమా త్వరలో జపాన్‌లోనూ విడుదల కానుంది. ఇక, ఈ ఏడాది 'ఆస్కార్‌' బరిలోకి 'ఆర్‌ఆర్‌ఆర్‌' దిగుతున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details