అందరి దర్శకుల లాగే తనకు కూడా హాలీవుడ్ సినిమాకు దర్శకత్వం వహించాలని ఉందని తన మసనులో మాటను తెలియజేశారు దర్శకధీరుడు రాజమౌళి. హాలీవుడ్ అవార్డుల సీజన్ కోసం అమెరికాకు వెళ్లిన ఆయన ఓ పోడ్కాస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు.
ఇండియాలో నేనే డిక్టేటర్.. కానీ హాలీవుడ్‌లో అడుగుపెట్టాలంటే కన్ఫ్యూజన్: రాజమౌళి - హాలీవుడ్‌లోకి ఎస్ఎస్ రాజమౌళి
అవకాశం దొరికితే తప్పకుండా హాలీవుడ్‌లో సినిమా చేయాలనుకుంటున్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. అయితే ప్రస్తుతం తాను చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
"హాలీవుడ్‌లో సినిమా తీయాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దర్శకుని కల అని నేను భావిస్తున్నాను. నేను కూడా అంతే. ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించే సమయంలో నాకు లభించే సృజనాత్మక స్వేచ్ఛను ఇష్టపడుతున్నాను. అందుకే హాలీవుడ్ ఎంట్రీ విషయమై కాస్త కన్ఫూజన్లో ఉన్నాను. ఇండియాలో నేనే డిక్టేటర్‌ని.. సినిమా ఎలా తీయాలో నాకు ఎవ్వరూ చెప్పరూ" అని వ్యాఖ్యానించారు. కానీ హాలీవుడ్‌లో ప్రాజెక్ట్ చేస్తే అది నా గుర్తింపును మరింత రెట్టింపు చేస్తుంది. బహుశా, హాలీవుడ్‌లో నా తొలి అడుగు ఎవరితోనైనా కలిసి పనిచేయడమే అవుతుంది" అని రాజమౌళి అన్నారు.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ గతేడాది విడుదలై ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా దాదాపు రూ.1200కోట్ల వరకు వసూలు చేసింది. ఇకపోతే ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు రాగా.. ఇటీవలే 'నాటు నాటు' సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ఇక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్‌లో రెండు పురస్కారాలను దక్కించుకుంది.