తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

చిక్కుల్లో షారుక్​ 'జవాన్​' మూవీ.. దర్శకుడు అట్లీపై ఫిర్యాదు - srk film jawan plagiarism controversy

బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ నటిస్తున్న జవాన్‌ మూవీ చిక్కుల్లో పడింది. ఈ చిత్ర దర్శకుడు అట్లీపై ఓ కోలీవుడ్ నిర్మాత ఫిర్యాదు చేశారు.

SRK's Jawan runs into trouble
చికుల్లో షారుక్​ 'జవాన్​' మూవీ.. దర్శకుడు అట్లీపై ఫిర్యాదు

By

Published : Nov 7, 2022, 3:15 PM IST

Updated : Nov 7, 2022, 3:28 PM IST

బాలీవుడ్ హీరో షారుక్​ ఖాన్​ నటిస్తున్న జవాన్‌ మూవీ చిక్కుల్లో పడింది. ఈ చిత్ర డైరెక్టర్‌ అట్లీపై ఓ కోలీవుడ్‌ నిర్మాత ఫిర్యాదు చేసినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.

అసలేం జరిగిందంటే.. బాలీవుడ్‌ బాద్​షా షారుక్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో జవాన్‌ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ మూవీపై ఇండియన్​ వైడ్​ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కథ తనదని, దర్శకుడు అట్లీ దానిని కాపీ కొట్టారని కోలీవుడ్‌ నిర్మాత మాణిక్యం నారాయణన్‌ ఆరోపించారు.

అంతేకాదు డైరెక్టర్‌ అట్లీపై నిర్మాత మండలిలో ఫిర్యాదు కూడా చేశారు. 2006లో తాము విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించిన 'పేరరసు' సినిమా కథనే అట్లీ 'జవాన్' పేరుతో హిందీలో తెరకెక్కిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో జవాన్‌ మూవీపై కాపీ రైట్‌ ఆరోపణలు రావడంతో బాద్‌షా ఫ్యాన్స్‌ ఆందోళన చేందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీటీమ్​ స్పందించలేదు.

ఇదీ చూడండి:ఆ హీరోలకు నేను వీరాభిమానిని.. నాపై ఆయన ప్రభావం ఉంది: యశ్​

Last Updated : Nov 7, 2022, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details