తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఎన్టీఆర్ డైలాగ్​తో.. పవర్​ ప్యాక్ట్​డ్​గా 'పెదకాపు -1' టీజర్​

Pedda kapu movie teaser : డైరెక్టర్​ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న 'పెద్ద కాపు -1' టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ప్రచార చిత్రం పవర్​ఫుల్​గా ఉంది. మీరు చూశారా?

Peda kapu 1 trailer released
ఎన్టీఆర్ డైలాగ్​తో.. పవర్​ ప్యాక్ట్​డ్​గా 'పెదకాపు -1' టీజర్​

By

Published : Jul 2, 2023, 2:02 PM IST

Pedda kapu movie teaser : టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియెన్స్​ డైరెక్టర్​ శ్రీకాంత్ అడ్డాల.. తన రూటు మార్చి యాక్షన్​ సినిమాలను చేసే పనిలో పడ్డారు. 'నారప్ప' లాంటి ఊర మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​ను రూపొందించి సూపర్ హిట్ అందుకున్న ఆయన.. ఇప్పుడు 'పెద్ద కాపు -1' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టైటిల్​తోనే చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఓ సామాన్యుడి సంతకం అనే క్యాప్షన్.. సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం టీజర్​​ విడుదలై ఆకట్టుకుంటోంది.

'తెలుగు జనతకు వందనం. వెనకబడిన తరగతిని ఇంకా ఇంకా అట్టడగు తొక్కివేయబడుతుంటే శిక్షించలేక, రాజకీయం భ్రష్టమై వ్యాపారాత్మకై, దగాకోరు విధానమై, ఆంధ్రా ఆత్మాభిమానం చంపుతుంటే మీ కోసం వచ్చా' అని సీనియర్ ఎన్టీఆర్​ డైలాగ్​తో ట్రైలర్ ప్రారంభమైంది. 'ఇది కేవలం జెండా కాదు మన ఆత్మగౌరవం', మా నాన్న ఓ మాట చెప్పారు. బాగా బతకడం అంటే.. నిన్నటి కంటే ఈయాల బాగుండాలి, ఈయాలి కంటే రేపు బాగుండాలి' అనే సంభాషణలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇంకా ఈ ప్రచార చిత్రంలో బలమైన​ యాక్షన్​ సన్నివేశాలు, డైలాగ్​లు కూడా ఉన్నాయి. అలాగే ఓ చోట అసభ్యకరమైన పదజాలం కూడా వాడారు. మొత్తంగా ఈ ప్రచార చిత్రం చూస్తుంటే.. గ్రామంలోని రెండు వర్గాల మధ్య కులాల కోసం, ఆధిపత్యం కోసం జరిగే కొట్లాటలో ఎదురుతిరిగిన ఓ యువకుడి కథ అని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని 'అఖండ'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై ఇది రూపొందుతోంది.

Srikanth addala new movie : ఈ చిత్రంతో రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు ఆడియెన్స్​ను బాగానే ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్​ బాధ్యతలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపుగా తుది దశకు చేరుకుంది.

ABOUT THE AUTHOR

...view details