Sridevi Drama Company Latest Promo: ప్రతి ఆదివారం ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని పంచుతున్న షో 'శ్రీదేవి డ్రామా కంపెనీ'. ఈ వారం కూడా సరికొత్తగా వీక్షకులను అలరించేందుకు ముస్తాబైంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తన పంచ్‌లతో వీక్షకులను ఎంతగానో నవ్వించే ఇమ్మాన్యుయేల్.. ఈ సారి బ్రేకప్ సాంగ్ పాడి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత వర్షతో ప్రస్తుత రిలేషిప్ స్టేటస్ గురించి చెప్పారు. దీంతో జడ్జి ఇంద్రజ.. 'ఏమైంది వర్షా' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
హైపర్ ఆది రొమాంటిక్ డ్యాన్స్.. చుట్టూ ఎంత మంది హాట్ బ్యూటీలో! - హైపర్ ఆది డ్యాన్స్
Hyper Aadi Romantic Dance: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. 'వల్లభా నా వల్లభా' రొమాంటిక్ సాంగ్‌కు తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. హాట్ బ్యూటీలతో కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. ఆదిలో ఈ యాంగిల్ చూసి అందరూ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ సారి ఆది డ్యాన్స్ చూసేయండి.
Hyper Aadi Romantic Dance: అయితే ఈ వారం కూడా హైపర్ ఆదికి పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఎపిసోడ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రోమో స్టార్టింగ్‌లో భార్యతో కలిసొచ్చిన పంచ్ ప్రసాద్.. ఆదిపై ఆటో పంచులేస్తూ తెగ నవ్వించారు. ఈ పంచ్‌లకు ఎలా రెస్పాండ్ కావాలో తెలియక ఆది తల పట్టుకున్నారు. జాతకాలు చెబుతానంటూ ఆది కూడా తన స్టైల్లో కామెడీ పండించారు. ఇక చివరలో 'వల్లభా.. నా వల్లభా' అనే రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేసిన హైపర్ ఆది.. స్టేజీపై రెచ్చిపోయారు. ఆదిలో ఈ యాంగిల్ చూసిన యాంకర్ రష్మీతో పాటు మిగతా అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. మీరూ ఓ సారి ఆ ప్రోమో చూసేయండి.