తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

రష్మి అలా చేశావేంటి.. స్టేజ్​పైనే హైపర్​ ఆదికి గుండు కొట్టించిందిగా! - హైపర్ ఆదికి షాకింగ్ అనుభవం

స్టార్​ కమెడియన్ హైపర్​ ఆది చేసిన ఓ పనికి మిగతా కంటెస్టెంట్​లు అందరూ కలిసి స్టేజ్​పైనే అతడికి గుండు కొట్టించారు. ఇంతకీ ఏమైందంటే?

Hyper adi gundu
రష్మి టాస్క్​.. హైపర్​ ఆదికి చేదు అనుభవం.. స్టేజ్​పైనే గుండు కొట్టించుకొని

By

Published : Nov 28, 2022, 5:33 PM IST

Updated : Nov 28, 2022, 6:00 PM IST

స్టార్ కమెడియన్ హైపర్ ఆదికి ఏకంగా స్టేజీపైనే గుండు కొట్టేశారు. దీంతో ప్రేక్షకులంతా ఒక్కసారిగా షాక్​ అయ్యారు. ఎందుకిలా జరిగిందంటూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్​లో ట్రెండ్ అవుతోంది. అసలేం జరిగిందంటే..

హైపర్ ఆది బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 'జబర్దస్త్'లోకి రైటర్​గా ఎంట్రీ ఇచ్చిన అతను.. కొద్ది కాలంలోనే టీమ్​ లీడర్​గా ఎదిగాడు. జబర్దస్త్​ మాత్రమే కాకుండాఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ సహా పలు షోల్లోనూ చుర్గుగా పాల్గొంటూ తనదైన శైలిలో నవ్వులు పంచుతున్నాడు.

అయితే ఎప్పటిలాగే ప్రతి ఆదివారం ప్రేక్షకులను అలరిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ... ఈవారం 'చదివింపులు' పేరుతో వినోదం పంచేందుకు సిద్ధమైంది. అయితే ఈ సారి అతిథిగా వచ్చిన నటి జ్యోతితో కలిసి ఎంట్రీ ఇచ్చిన ఆది.. తన స్టైల్లో పంచ్‌లు విసిరి కామెడీ పండించాడు.

ఈ క్రమంలోనే అతడికి ఓ షాకింగ్ టాస్క్ ఇచ్చింది యాంకర్​ రష్మి. ఓ నంబరుని సెలెక్ట్ చేసుకోవాలి, దాని వెనక ఏముంటే అది చేయాలి అని చెప్పగా.. అందుకు అంగీకరించాడు ఆది. 11 నంబర్ సెలెక్ట్ చేసుకోగా.. 'గుండు కొట్టించుకోవాలి' అని దాని వెనక రాసి ఉంది. దీంతో మిగతా కమెడియన్స్ అందరూ ఆదికి గుండు కొట్టించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక లైవ్​లోనే స్టేజిపైన గుండు కొట్టించేందుకు సిద్ధమైపోయాడు ఆది. దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్​ చేశారు మేకర్స్​. మరి అతడు నిజంగానే గుండు కొట్టించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్​ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఇక షోలో ఓలేటి లక్ష్మీ, సృజన తిన్నావా రా కూడా ఎంట్రీ ఇచ్చి సందడి చేశారు.

ఇదీ చూడండి:ఆ దేశంలో పుష్ప మేనియా షురూ.. మేకర్స్​ కీలక నిర్ణయం

Last Updated : Nov 28, 2022, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details