ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ వారం ఎపిసోడ్ మరింత ప్రత్యేకంగా ఉండనుంది. 'చెప్పు బుజ్జికన్నా' పేరుతో రానుంది. ఈ షోలో ప్రేమ జంటలు తమ లవర్స్‌కు కానుకలిచ్చారు. లవ్ గురు అంటూ రాఘవ నవ్వులు పూయించారు. ఇక హైపర్ ఆది ఎప్పటి లాగే తన పంచ్‌లతో అదరగొట్టేశాడు. ఈ క్రమంలోనే రష్మిని తన ప్రేమ గురించి చెప్పాలని కోరాడు. అంతలో గాలోడు అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించగా.. ఆది మాత్రం సిద్ధు అని ఒకటి రాస్తా అంటూ బోర్డు మీద పేరు రాయబోయాడు. దీంతో రష్మి అక్కడే ఎమోషనల్ అయింది. బాగా ఏడ్చేసింది. మరి ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఫిబ్రవరి 12న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి.
ఎంత పని చేశావ్ హైపర్ ఆది... స్టేజ్‌పైనే ఏడ్చేసిన రష్మి!
ఓ వైపు షోలతో మరోవైపు సినిమాలతో బిజీగా గడుపుతోంది యాంకర్ రష్మి. అయితే ఈ ముద్దుగుమ్మ తాజాగా.. హైపర్ ఆది చేసిన ఓ పనికి స్టేజ్‌పైనే ఏడ్చేసింది. ఆ వీడియోను మీరు చూసేయండి..
కాగా, గతంలోనూ తన ప్రియుడు మోసం చేయడంతో కుంగిపోయినట్లు తెలిపింది రష్మి. ఆ బాధను తెలుపుతూ విషాద గీతానికి డ్యాన్స్ చేసి ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించింది. తాను ప్రేమించిన వాడు మోసం చేయడంతో ఎంతగా తపించిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇకపోతే 'ఎక్స్ ట్రా జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ'లకు హోస్ట్‌గా చేస్తోంది యాంకర్ రష్మి. ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది.
ఇదీ చూడండి:RC 15: రూ.15కోట్లతో మరో పాట.. ఏకంగా 500 మంది డ్యాన్సర్లతో!