తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

శ్రీదేవి శోభన్​బాబు ప్రేమకథలో ట్విస్ట్​.. ఏమై ఉంటుంది? - శ్రీదేవి శోభన్ బాబు మూవీ ట్రైలర్​

Sri devi shoban babu movie trailer: సంతోష్‌ శోభన్‌ నటించిన 'శ్రీదేవి శోభన్​బాబు' సినిమా ట్రైలర్​ను 'ఆచార్య' ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Sri devi shoban babu trailer
శ్రీదేవిశోభన్ బాబు ట్రైలర్

By

Published : Apr 24, 2022, 7:48 AM IST

Sri devi shoban babu movie trailer: సంతోష్‌ శోభన్‌, గౌరి జి కిషన్ జంటగా శోభన్‌ బాబు, శ్రీదేవి పాత్రల్లో మనల్ని అలరించడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఈ జంట నటించిన 'శ్రీదేవి శోభన్​బాబు' సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్. శనివారం 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలోనే 'శ్రీదేవి శోభన్ బాబు' ప్రచార చిత్రం విడుదలైంది.

రేడియోలో వస్తున్న వాఖ్యానంతో మొదలైన ప్రచార చిత్రంలో హీరోకు నోటివాటం ఎక్కువ, హీరోయిన్ కు చేతి వాటం ఎక్కువ అంటూ సినిమాలోని అందరీ పాత్రలను పరిచయం చేశారు. టామ్ అండ్ జెర్రీ లా గొడవపడే ఈ హీరో హీరోయిన్లు ప్రేమలో ఎలా పడ్డారు? వారి ప్రేమకు ఎదురైన సమస్య ఏంటి? చివరకు దాన్ని ఎదురించి ఈ జంట ప్రేమలో గెలిచిందా? అనేది ఈ చిత్ర కథాంశమని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తంగా ఈ ట్రైలర్.. మనసుకు హత్తుకునే సన్నివేశాలు, హృదయానికి తాకే పాటలు, రొమాంటిక్ కామెడీతో సినీప్రియులను ఆకట్టుకునేలా ఉంది. కాగా, కమ్రాన్‌ స్వరాలందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మెల దర్శకత్వం వహించారు. గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై విష్ణు ప్రసాద్‌, చిరు పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్ధార్ధ్‌ రామస్వామి సినిమాటోగ్రఫీ అందించారు.

ఇదీ చూడండి:

రాజమౌళి వల్లే 'ఆచార్య'లో నటించా!: చిరు

అలాంటి కథల్ని చేయడానికే నేను ఇష్టపడతా: చిరు

ABOUT THE AUTHOR

...view details