Sreeleela Movies Break: ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోలతో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఎంతలా అంటే ఉదయం ఒక సినిమా షూటింగ్, మధ్యాహ్నం మరో చిత్రం, రాత్రికి వేరోక షూటింగ్ లోకేషన్‌కు వెళ్లిపోతుంది. ఇలా కొన్ని నెలలుగా రెస్ట్ లేకుండా సినిమాల షూటింగ్‌లతో గడుపుతోంది శ్రీలీల. ఈ నేపథ్యంలో సినిమాలకు కొన్ని రోజులు పాటు ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉండాలని అనుకున్నట్లు సమాచారం. దీంతో షూటింగ్స్ నుంచి తాత్కాలికంగా బ్రేక్ తీసుకోనుందని తెలుస్తోంది.
ఎంబీబీఎస్ పరీక్షల కోసమే బ్రేక్!
అయితే సినిమాల్లో కెరీర్ సాగిస్తూనే అటు పర్సనల్ లైఫ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు శ్రీలీల ఇదివరకు పలుమార్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపెరేషన్స్లో ఉందట. అందుకనే సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాల్లో హీరోయిన్‌గా తన కెరీర్ ఎంత ముఖ్యమో ఎంబీబీఎస్ పూర్తి చేయడం కూడా తన లక్ష్యమని శ్రీలీల ఇప్పటికే పలు సందర్బాల్లో చెప్పింది.
Sreeleela Guntur Karam :మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'గుంటూరు కారం'లో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే శ్రీలీల, మహేశ్ బాబు జోడీ చాలా ఫ్రెష్‌గా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇటీవలే 'ఓ మై బేబీ' అనే పాటను కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో శ్రీలీలతో పాటు మరో హీరోయిన్ మీనాక్షి చౌదరీ కీలక పాత్ర పోషిస్తోంది. హారిక అండ్ హసిన్ క్రియేషన్స్ బ్యానర్‌పై యస్ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్ పనులు స్పీడ్‌గా పూర్తిచేసి 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ విడుదల చేసేందుకు మూవీటీమ్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాతోపాటు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్- హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' లోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక శ్రీలీల ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో కలిపి 10కి పైగా సినిమాలు చేస్తోంది.
ఆ మూడు లక్షణాలు ఉంటేనే శ్రీలీల పెళ్లి చేసుకుంటుందట! మరి మీలో ఎవరికైనా ఉన్నాయా?
'నువ్వే నా ఇన్స్పిరేషన్ - నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి'