Sreeleela Anil Ravipudi Relation : హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. తన యాక్టింగ్, డ్యాన్స్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఓ వైపు యంగ్ హీరోలతో ఆడిపాడుతూనే మరోవైపు సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. మరో మూడు రోజుల్లో 'భగవంత్ కేసరి'లో బాలయ్యతో కలిసి సందడి చేయనుంది.
ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఆయన శ్రీలీల గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు శ్రీలీల దగ్గరి బంధువు అవుతుందని సీక్రెట్ రివీల్ చేశారు! శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంతూరు ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు అని చెప్పారు. అదే ఊరు తన అమ్మమ్మది కూడా అని అనిల్ పేర్కొన్నారు. శ్రీలీల తల్లి స్వర్ణ తనకు అక్క వరుస అవుతుందని ఆయన అన్నారు. ఆ లెక్కన అనిల్‌కు శ్రీలీల కోడలు అవుతుందనమాట.
భగవంత్ కేసరి సెట్స్‌లో అందరి ముందు డైరెక్టర్ గారు అని తనను శ్రీలీల పిలుస్తుందని, ఎవరూ లేనప్పుడు మాత్రం 'మామయ్య' అంటూ ఆట పట్టిస్తుందని కూడా చెప్పారు. శ్రీలీల పుట్టింది తెలుగు నేలపైనే అయినా... పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాలోనే. అయినా ఆమె తన అమ్మమ్మ ఊరు పొంగులూరుకు ప్రతీ ఏటా వస్తుందని అనిల్ రావిపూడి స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ఫ్యాన్స్ తెగ ఎగ్జైత్ అవుతున్నారు. అక్క కూతురితో సినిమా తీశావా అనిల్ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.