Sreeleela 2023 Movies :టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే పాపులర్ అయ్యింది. గతేడాది మాస్ మహారాజా రవితేజ 'ధమాకా' సినిమాతో కెరీర్లో తొలి హిట్ అందుకున్న ఈ బ్యూటీ తర్వాత, వరుస ఆఫర్లు దక్కించుకొని మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది. ఈ ఏడాదంతా శ్రీలీల చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిందనే చెప్పాలి.
స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ పట్టేసిన శ్రీలీల ఈ ఏడాది ఏకంగా నాలుగు పెద్ద సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన 'స్కంద'లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి జంటగా నటించిందీ ముద్దుగుమ్మ. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకుంది.
ఆ సినిమాతో అదుర్స్ : శ్రీలీల ఈ ఏడాది తన రెండో సినిమా 'భగవంత్ కేసరి' సినిమాతో హిట్ అందుకుంది. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.