Sree Vishnu Alluri teaser: "విప్లవానికి నాంది చైతన్యం. చైతన్యానికి పునాది నిజాయతీ. నిజాయతీకి మారుపేరు అల్లూరి సీతారామరాజు" అంటున్నారు నటుడు శ్రీవిష్ణు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం 'అల్లూరి'. ప్రదీప్‌వర్మ దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని ఈ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. "ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్..! పోలీస్.. బయలుదేరాడురా" అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో శ్రీవిష్ణు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విభిన్నమైన లుక్‌లో దర్శనమివ్వనున్నారు. నిజాయతీ ఉన్న ఒక పోలీసు అధికారి కథ చెప్పాలనే ఉద్దేశంతో ఎంతో పరిశోధన చేసి.. తాను ఈ కథను రూపొందించినట్లు ప్రదీప్ తెలిపారు. ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అల్లూరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? అతను చేసిన త్యాగాలేంటి? సమాజం, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నాడు? అన్న కోణాల్లో ఈసినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించారు.
పవర్‌ఫుల్‌గా 'అల్లూరి' టీజర్.. హృదయాన్ని హత్తుకుంటున్న 'సీతారామం' సాంగ్ - దుల్కర్ సల్మాన్ సీతారామం
Sree Vishnu Alluri teaser: శ్రీవిష్ణు హీరోగా.. పోలీస్ అధికారి ఫిక్షనల్ బయోపిక్‌గా రూపొందుతున్న సినిమా 'అల్లూరి'. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ నటించిన 'సీతారామం'లోని సెకండ్ సాంగ్ విడుదలై హృదయాన్ని తాకేలా ఉంది.
Dulquer salman Sitaramam: దుల్కర్ సల్మాన్ కథా నాయకుడిగా స్వప్న సినిమా పతాకంపై 'సీతారామం' చిత్రం తెరకెక్కుతోంది. మృణాళిని ఠాకూర్ కథానాయిక. ఇందులో 'అఫ్రీన్' అనే కీలక పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకుడు. అశ్వినీదత్, ప్రియాంకదత్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ లిరికల్ సాంగ్ 'ఇంత అందం' రిలీజ్ అయింది. ఇది శ్రోతల హృదయానని హత్తుకునేలా ఉంది. కాగా, ఈ మూవీలో సీత పాత్రలో మృణాళిని, లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. దీన్ని తెలుగుతోపాటు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం- పి.ఎస్.వినోద్, సంగీతం- విశాల్ చంద్రశేఖర్, కూర్పు- కోటగిరి వెంకటేశ్వరరావు, కళ- వైష్ణవిరెడ్డి, ప్రొడక్షన్ డిజైన్- సునీల్ బాబు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: షూటింగ్లో స్టార్ హీరోకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు!