తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అమిత్​ షా పిలిచినా నిఖిల్​ వెళ్లలేదు.. ఎందుకో తెలుసా?

SPY Movie Telugu : టాలీవుడ్​ హీరో నిఖిల్​ 'స్పై' సినిమా చిత్రీకరణలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటనను ప్రేక్షకులతో పంచుకున్నారు. కేంద్ర హోం మంత్రి పిలిచినా.. వెళ్లలేదని చెప్పారు. దానికి కారణాన్ని కూడా తెలిపారు. ఇంతకీ ఆ కారణం ఏంటంటే..

SPY Movie Telugu
SPY Movie Telugu

By

Published : May 16, 2023, 10:12 PM IST

Updated : May 17, 2023, 10:35 AM IST

SPY Movie Telugu : వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు టాలీవుడ్ యంగ్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ. ఇటీవల 'కార్తికేయ-2'తో పాన్​ ఇండియా హిట్​ అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అలాంటి మరో యాక్షన్​ థ్రిల్లర్​ 'స్పై'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు నిఖిల్​. ఇటీవలే విడుదలైన 'స్పై' టీజర్​​కు అదిరిపోయే రెస్పాన్స్​ వస్తోంది. స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాశ్​ చంద్రబోస్​ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్​ సమంయలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు గురించి పంచకున్నారు నిఖిల్​.
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చిందని.. అయితే ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని వెళ్లలేదని నిఖిల్‌ తెలిపారు. తనని ఆహ్వానించినందుకు అమిత్‌ షాకు కృతజ్ఞతలు చెప్పారు. టీజర్‌ విడుదల సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలకు చిత్రం బృందం సమాధానాలిచ్చింది.

కల్యాణ్‌రామ్‌ హీరోగా నటించిన 'డెవిల్‌', 'స్పై' రెండూ కథలు ఒకటేనని టాక్‌ వినిపిస్తోంది, మీరేమంటారని విలేకరి అడిగిన ప్రశ్నకు నిఖిల్​ సమాధానమిచ్చాడు. 'అది వేరే కథ. 1920 నేపథ్యంలో సాగుతుంది. మా 'స్పై' సినిమా ప్రస్తుత కాలంలో జరుగుతుంది. రెండు సినిమాల నేపథ్యాలు వేరు. మీరు ఆ రెండింటినీ పోల్చలేరు. రెండు సినిమాల కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. రెండు సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారు. మా సినిమా టీజర్ విడుదలైన తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా కూడా సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలోనే ఉంటుందని తెలిసింది. మేము వారితో మాట్లాడాము. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. జెండాలకు ఎజెండాలు లేవు. నిజాయితీతో కూడిన సినిమా ఇది. మేము నిజమైన రా (RAW) ఏజెంట్ల వలె శిక్షణ పొందాము. నేను ఏ పార్టీ కోసం సినిమాలు చేయడం లేదు. భారతీయుడిలా ఈ సినిమా చేస్తున్నాను. కృష్ణుడి పట్ల భక్తి భావంతో 'కార్తికేయ 2' అంగీకరించినప్పటికీ. కేంద్ర మంత్రులతో పాటు ప్రతి పార్టీ నేతలకు మా సినిమా చూపిస్తాం' అని చెప్పుకొచ్చాడు.

'కార్తికేయ-2' హిట్​ తర్వాత ఈ సినిమాకు బడ్జెట్‌ పెంచారట. అంది ఎంతవరకు నిజం అని సినిమా దర్శకుడు అడిగిని ప్రశ్నకు ఆయన స్పందించారు. 'అలాంటిదేమీ లేదు. ముందుగా అనుకున్న దాని ప్రకారమే ఈ సినిమా రూపొందుతోంది. తొలి సినిమా తీస్తున్న దర్శకుడిని నమ్మి ఈ స్థాయిలో ఎవరూ డబ్బులు పెట్టరు. నిర్మాత మేము చెప్పిన కథను నమ్మారు. కార్తికేయ-2 కన్నా ముందే ఈ సినిమాను మొదలు పెట్టాం. అయినా రీసెర్చ్‌ కోసం లేట్​ అయింది. ఈ కథకు నేపథ్యానికి తగ్గ లొకేషన్స్‌ వెతకడంలో ఆలస్యమైంది. సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ఆధారంగానే 'స్పై' సినిమా తెరకెక్కిస్తున్నాం. ఇందులో 10శాతం మాత్రమే కల్పితం ఉంటుంది. మిగతాదంతా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ఆధారంగానే తీశాం' అని వివరించారు.

Last Updated : May 17, 2023, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details