మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఓ డైరెక్టర్‌తో మరోసారి జట్టుకట్టడానికి రెడీ అవుతున్నారు. ఇంతకముందు తనకు 'బెంగాల్ టైగర్'తో హిట్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నందితో వచ్చే ఏడాది ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. రీసెంట్గా రవితేజకు సంపత్ నంది కథ చెప్పారని.. దానికి రవితేజ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయం గురించి సంపత్గాని, రవితేజ గాని స్పందించలేదు.
కాగా, డైరెక్టర్ సంపత్ నంది-రవితేజ కలయికలో ఇప్పటికే 'బెంగాల్ టైగర్' చిత్రం వచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. మరి రవితేజ ఇమేజ్ కోసం సంపత్ నంది ఈసారి ఎలాంటి కథ రాశారో చూడాలి. అయితే ఇలాంటి కథతోనే సంపత్ నంది.. గోపీచంద్‌తో సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ మాస్ మహారాజా అయితేనే తన కథకు పూర్తి న్యాయం జరుగుతుందని సంపత్ నంది భావించారట. అందుకే.. రవితేజతో సినిమా స్టార్ట్ చేయబోతున్నట్లు సనీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.