తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

హిందీ బిగ్​బాస్​ యాంకర్​గా కరణ్​ జోహార్!​.. మరి సల్మాన్​​? - సల్మాన్ ఖన్​కు డెంగీ ఫీవర్

హిందీ బిగ్​బాస్​ వ్యాఖ్యాతగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యహరించనున్నారని బీటౌన్​లో వార్తలు వస్తున్నాయి. మరి సల్మాన్​ఖాన్ పరిస్థితేంటి? ఆయనకు ఏమైంది?

big boss show season 16 host karan johar
big boss show season 16 host karan johar

By

Published : Oct 22, 2022, 1:13 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆయన సంపాదించుకున్నారు​. అటు వరుస సినిమాలు చేసుకుంటూ.. ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తున్నారు. టీవీ రియాలిటీ షో హిందీ బిగ్​బాస్​కు గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే సల్మాన్​.. కొన్నిరోజుల పాటు బిగ్​బాస్ షో​కు దూరంగా ఉండననున్నారని సమాచారం. ఇటీవలే ఆయన డెంగీ బారినపడినట్లు తెలిసింది. దీంతో శారీరకంగా విశ్రాంతి తీసుకోవాలని సల్మాన్​కు వైద్యులు సూచించారట. అందుకే ఆయన బదులు బిగ్​బాస్​ షోకు హోస్ట్​గా బాలీవుడ్​ నిర్మాత కరణ్ జోహార్​​ వ్యవహరించనున్నారట.
ప్రస్తుతం సల్మాన్​ తదుపరి చిత్రం 'కిసీ కా భాయ్​ కిసీ కీ జాన్​' షూటింగ్​ జరుగుతోంది. అయితే జ్వరం కారణంగా ఆయన షూటింగ్​కు కూడా దూరమయ్యారు.

ABOUT THE AUTHOR

...view details