ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బుల్లితెరపై మాస్ సంగమం.. 'అన్​స్టాపబుల్'​ షోలో పవన్​ కల్యాణ్? - బాలకృష్ణ టాక్ షో ఎపిసోడ్ 2

బుల్లితెరపై మాస్​ జాతర రాబోతోంది. బాలకృష్ణ టాక్​ షోలో గెస్ట్​గా పవర్ స్టార్​ పవన్ కల్యాణ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'అన్​స్టాపబుల్​ 2' రెండో ఎపిసోడ్​ ప్రోమోలో ఈమేరకు సంకేతాలు వెలువడ్డాయి. బాలయ్య స్వయంగా.. పవన్​ రాక గురించి ఏమన్నారంటే..

balakrishnas unstoppable show season 2
balakrishnas unstoppable show season 2
author img

By

Published : Oct 16, 2022, 2:04 PM IST

తెలుగు అశేష ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు ఈ మాస్​ హీరోలు. తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్​ సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? ఇద్దరు ఎదురుపడి సంభాషించుకుంటుంటే ఏమౌతుంది? ఈ ప్రశ్నలు ఇప్పుడు అభిమానుల మనసుల్లో మెదులుతున్నాయి. ఆ ఇద్దరు ఎవరంటే.. పవర్​ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం బాలకృష్ణ. వీరిద్దరూ బుల్లితెరపై సందడి చేసేలా ఉన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్​ షో 'అన్‌స్టాపబుల్​' ఇందుకు వేదికయ్యే అవకాశముంది.

బాలకృష్ణ హోస్ట్​గా ఓటీటీ వేదిక ఆహాలో 'అన్​స్టాపబుల్​' షో సీజన్ 1 అద్భుత విజయం సాధించింది. దీంతో సీజన్ 2 కూడా ప్రారంభమైంది. సీజన్ 2 మొదటి ఎపిసోడ్​ గెస్ట్​గా మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. గంట పాటు నవ్వుల వర్షం కురిపించారు. మరెన్నో సీరియస్ పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడారు. ఆదివారం రెండో ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో టాలీవుడ్‌ యువ నటులు విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ సందడి చేశారు. ఇదే ఎపిసోడ్‌లో నిర్మాత నాగవంశీ కనిపించి.. తమ బ్యానర్‌ నుంచి త్రివిక్రమ్‌ బయటకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు.

అనంతరం బాలయ్య.. దర్శకుడు త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేసి.. "అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్‌?" అని ప్రశ్నించారు. "మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను‌" అని డైరెక్టర్‌ చెప్పగానే.. "ఎవరితో రావాలో తెలుసుగా" అని బాలయ్య అన్నారు. త్రివిక్రమ్, పవన్​ కల్యాణ్​ మంచి స్నేహితులు కాబట్టి.. పవన్​తో రావాలనే ఉద్దేశంతో బాలకృష్ణ అన్నట్టు స్పష్టం అవుతోంది. ఒకవేళ పవన్, బాలయ్య ఒకే స్టేజ్​పై కలిస్తే.. అభిమానులకు ఇక ఐఫీస్టే. షో ప్రోమో వచ్చిన కొద్దిసేపటికే.. సోషల్​ మీడియాలో పవన్-బాలయ్య కాంబో గురించి చర్చ మొదలైంది.
బాలకృష్ణ రాజకీయాలు, వరుస సినిమాలు, టాక్​ షోతో బిజీగా ఉన్నారు. పవన్​ కల్యాణ్​ సినిమాలు, రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు చాలా తక్కువ. పవన్​ షో కు వస్తే.. బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఇవీ చదవండి:'సలార్‌' నుంచి న్యూ అప్డేట్​.. యాంగ్రీ లుక్‌లో స్టార్​ హీరో!

యూట్యూబ్​లో తోపు సినిమాలివే టాప్ హీరోలు వీళ్లే

ABOUT THE AUTHOR

...view details