South Industry Senior Actress :సౌత్ సినీఇండస్ట్రీ ఎప్పటికప్పుడు కొత్త భామలకు స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్లకు ప్రాధాన్యం తగ్గుతుంది. కానీ, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు సౌత్‌లో కొత్త హీరోయిన్ల హవా నడుస్తున్నా.. సీనియర్ భామల క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇదివరకు హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే.. సినిమాలకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు అలా కాదు. యంగ్ బ్యూటీలు వస్తున్నా.. సీనియర్లకు ఆకర్షణ ఓ మాత్రం తగ్గట్లేదు. ఈ జాబితాలో ఉన్న సీనియర్లు ఎవరంటే?
నయనతార.. సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార.. పెళ్లి తర్వాత కూడా కెరీర్లో జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఇటి హీరోయిన్గా అటు లేడీ ఓరియెంటేటెడ్ సినిమాల్లోనూ రాణిస్తు.. ఛాన్స్‌లు పట్టేస్తోంది. అలా 2021లో రజనీకాంత్ 'పెద్దన్న', 2022లో చిరంజీవి 'గాడ్‌ఫాదర్', రీసెంట్గా 'జవాన్' సినిమాల్లో నటించి తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. ప్రస్తుతం నయన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.
అనుష్క శెట్టి..దాదాపు 5 ఏళ్ల తర్వాత 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాతో వెండి తెరపై మెరిసింది.. అనుష్క శెట్టి. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టిన అనుష్క.. మరిన్ని ప్రాజెక్ట్‌లకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో చిరంజీవి 156వ చిత్రంలో అనుష్క కీలక పాత్రలో నటించనుందట.
త్రిష..సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకుపైగా కెరీర్‌ను కొనసాగిస్తోంది నటి త్రిష. ఇదే ఏడాది 'పొన్నియిన్ సెల్వన్ - 2', 'లియో' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిందీ ముద్దుగుమ్మ. ఇక తెలుగులో చిరంజీవి సినిమాలో హీరోయిన్గా త్రిష ఓకే అయినట్లు టాక్ వినిపిస్తోంది. అటు తమిళంలో కూడా ఆఫర్లు వస్తున్నాయట.