NTR Sonali bendre: ఒకప్పుడు స్టార్ కథానాయికగా అగ్రహీరోలందరితో ఆడిపాడిన నటి సోనాలి బింద్రే. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. 2018లో క్యాన్సర్ బారిన పడి మనోధైర్యంతో చికిత్స తీసుకొని ఆ మహమ్మారి నుంచి కోలుకుంది. తాజాగా 'ది బ్రోకెన్ న్యూస్' అనే వెబ్ సిరీస్‌తో జూన్10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సోనాలి.. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఓ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుందన్న వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి.. ఈ విషయమై ఆశ్చర్యకరంగా స్పందించారు. 'మీరు ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్నారటగా' అని ఓ విలేకరి అడగ్గా.. "ఎవరూ? నేనా..! లేదు. నాకసలు ఈ విషయం తెలీదు. నాకు మీరు మాట్లాడే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఇది కచ్చితంగా రూమర్ అంతే" అని సమాధానం ఇచ్చింది.
ఎన్టీఆర్‌తో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సోనాలి బింద్రే - సోనాలి బింద్రే ఎన్టీఆర్ సినిమా
NTR Sonali bendre: హీరో ఎన్టీఆర్ నటించనున్న కొత్త చిత్రంలో సీనియర్ నటి సోనాలి బింద్రే నటించనుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై ఆమె క్లారిటీ ఇచ్చారు.
ఇక క్యాన్సర్ గురించి మాట్లాడుతూ.. "క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్‌కి ముందు క్యాన్సర్‌కి తర్వాత అన్నట్లు ఉంటాయి. మనిషి తన జీవితంలో ఏదో ఒక దాని వల్ల పాఠాలు నేర్చుకోవాలి. నేను దీని(క్యాన్సర్) నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నానని భావిస్తున్నాను. ఇది లక్ష్యం కాదు. ఇది ఒక ప్రక్రియ మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్యులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నన్ను ఇంటికి పంపుతామని చెప్పారు" అంటూ సోనాలి తన ట్రీట్‌మెంట్ రోజులను గుర్తుచేసుకున్నారు.
ఇదీ చూడండి:ఆ షోకు గెస్ట్‌గా విజయ్-అనన్య.. డ్యాన్స్ వీడియో వైరల్!