తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సీక్రెట్​గా సోనాక్షి సిన్హా నిశ్చితార్థం.. ఇన్​స్టాలో ఫొటోలు! - sonakshi sinha instagram photos

బాలీవుడ్​ స్టార్​ కిడ్​ సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్​స్టాలో ఆమె చేసిన షేర్​ చేసిన ఫొటోలే.. ఈ చర్చలకు కారణం.

sonakshi
సోనాక్షి

By

Published : May 9, 2022, 10:49 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాకు సంబంధించిన ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్​స్టాలో ఆమె షేర్​ చేసిన ఫొటోలు వైరల్​గా మారాయి. ఆ ఫొటోల కారణంగా సోనాక్షికి సీక్రెట్​గా నిశ్చితార్థం అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. డైమండ్‌ రింగ్‌ తొడిగినట్టు ఆ ఫొటోలు ఉండటం.. ఒక వ్యక్తి ఆమె చేతిని పట్టుకుని ఉండటం వల్ల.. నిశ్చిర్థం వార్తలకు మరింత ఊతమిచ్చింది.

అంతేకాదు.. తన డ్రీమ్‌ నెరవేరబోతుందని ఈ సందర్భంగా ఇన్​స్టాలో రాసుకొచ్చింది సోనాక్షి. 'ఈ రోజు నా లైఫ్‌లో బిగ్‌ డే. నా పెద్ద కలల్లో ఒకటి నెరవేరబోతుంది. మీతో ఆ విషయాన్ని పంచుకోవడానికి వేచి ఉండలేకపోతున్నా. దీన్ని నేనే నమ్మలేకపోతున్నా' అంటూ లవ్‌ ఎమోజీలను సైతం పంచుకుంది ఈ స్టార్​ కిడ్​. దీంతో కచ్చితంగా సోనాక్షి ఎంగేజ్​మెంట్​ అయ్యిందంటూ సోషల్​ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై సోనాక్షి ఏం స్పందిస్తో చూడాలి.

ఇదిలా ఉంటే.. ఇటీవల సల్మాన్‌ ఖాన్‌తో సోనాక్షి ఎంగేజ్‌మెంట్‌ అయినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై సోనాక్షి స్పందించి ఖండించింది. స్టార్‌ కిడ్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి సల్మాన్‌ ఖాన్‌తో 'దబాంగ్‌' సినిమాతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. బొద్దుగా ఉండే ఈ భామ తన అందాలతో కనివిందు చేస్తోంది.

ఇదీ చదవండి:విజువల్​ వండర్ 'అవతార్​-2' ట్రైలర్ వచ్చేసింది..

ABOUT THE AUTHOR

...view details