Skanda Opening Day Collection :మాస్ సినిమాల కేరాఫ్ అడ్రెస్ బోయపాటి శ్రీను - ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబోలో తెరకెక్కిన భారీ మాస్ ఎంటర్టైనర్ సినిమా స్కంద. ఈ కాంబో అనౌన్స్ చేసినప్పుడే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బోయపాటి మార్క్‌కు రామ్ ఎనర్జీ - శ్రీలీల గ్లామర్ తోడై ఈ చిత్రం సెప్టెంబర్ 28న థియేటర్లలో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విజయవంతమైన అఖండ తర్వాత ఆ స్థాయి, అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అలానే సినిమా కూడా బాక్సాఫీస్ ముందు మంచి టాక్ దక్కించుకుంది.
అయితే ఈ సినిమా తొలి రోజు వసూళ్ల వివరాలు బయటకు వచ్చాయి. నైజాంలో రూ.3.23 కోట్లు, సీడెడ్ రూ.1.22 కోట్లు, వైజాగ్ రూ.1.19కోట్లు, తూర్పు గోదావరిలో రూ.59 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.41 లక్షలు, కృష్ణలో రూ.45 లక్షలు, గుంటూరులో రూ.1.04కోట్లు, నెల్లూరులో రూ.49 లక్షలు వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.8.62 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నాయి. రామ్ పోతినేని కెరీర్లోనే ఇవి హైయెస్ట్ ఓపెనింగ్ వసూళ్లు కావడం విశేషం.
Skanda Movie Review :ఇకపోతే సినిమాలో సీనియర్ నటుడు శ్రీకాంత్, ప్రిన్స్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ బాంబ్ తమన్ సంగీతం అందించారు. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై సినిమాను నిర్మించారు. ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే.. రామ్ పోతినేని యాక్టింగ్, డ్యాన్స్. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, యాక్షన్, ఎమోషన్స్ డ్రామా సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అక్కడక్కడా రొటీన్‌గా సాగే సీన్స్ సినిమాకు మైనస్‌గా నిలిచాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. స్కంద బాక్సాఫీస్ మాస్ జాతర అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.