Skanda Movie Song : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని - యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'స్కంద'. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, తొలి పాట ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నుంచి 'గండరబాయి' అనే పాటను మూవీమేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పాటకు హీరో రామ్‌తో పోటీపడి మరీ హీరోయిన్ శ్రీలీల ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రేక్షకులు.. ఇద్దరి జోడీ అదిరిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Skanda Movie Cast : ఇక సినిమా విషయానికొస్తే.. 'అఖండ' తో ఫుల్ జోష్‌లో ఉన్న దర్శకుడు బోయపాటి.. ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇక మరోసారి తమన్.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదరగొడితే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఎడిటర్‌గా తమ్మిరాజు వ్యవహరించగా.. సంతోష్ డిటాకే కెమెరా బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. వినాయకచవితి సందర్భంగా 'స్కంద' సినిమా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
Ram Double Ismart :హీరో రామ్ నటించిన 'రెడ్', 'ది వారియర్' సినిమాలు డిజాస్టర్‌గా నిలవడం వల్ల.. కెరీర్లో మళ్లీ సక్సెస్ బాట పట్టాలని ఆశిస్తున్నాడు. కాగా ఈ సినిమా తర్వాత.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'డబుల్ ఇస్మాట్' సినిమా చేయనున్నారు. 2019లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన 'ఇస్మాట్ శంకర్' సీక్వెల్‌గా సినిమా తెరకెక్కనుంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్,నటి ఛార్మి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.