Skanda Movie OTT : ఎనర్జిటిక్ హీరో రామ్- బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'స్కంద'. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. బోయపాటి మార్క్‌తో సరికొత్త స్టోరీలైన్‌తో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దీంతో థియేటర్లలో మిస్ అయిన ఫ్యాన్స్ ఈ సినిమాను ఓటీటీల్లో చూడటం మొదలెట్టారు. అయితే నెటిజన్లు ఈ సినిమాలోని ఒక్కో సీన్‌ను తీక్షణంగా పరిశీలిస్తూ కొన్ని కొన్ని అంశాలను కనిపెడుతున్నారు. ప్రస్తుతం ఆ సీన్స్ నెట్టింట ట్రోలింగ్‌కు గురవుతోంది.
ఓ వైపు హీరో చేతిలో కాల్పుకు గురై.. ఇంకోవైపు ఆ సీన్‌ను చూస్తున్న వారిలో కూడా అదే వ్యక్తి కనిపించిన సీన్ గురించి మామూలుగా ట్రోలింగ్ జరగట్లేదు. అలాగే పొలిటికల్ సైన్స్ క్లాసులో ఉన్న అమ్మాయిలు సంబంధం లేని పుస్తకాలు పట్టుకుని కనిపించిన షాట్ కూడా ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే తాజాగా మరో సీన్‌తో ఇప్పుడు డైరెక్టర్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.