Skanda Movie Box Office Collection : ఎనర్జిటిక్ స్టార్ రామ్- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'స్కంద'. శ్రీలీల, సయీ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బోయపాటి మార్క్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు మంచి టాక్ లభించింది. రామ్ ఊర మాస్ లుక్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్.. సినిమాలో హైలైట్‌గా నిలిచాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా తొలి రెండు రోజులు మంచి వసూళ్లను అందుకోగా.. తాజాగా మూడో రోజు ఈ సినిమా రూ 5.3 కోట్లు సాధించింది.
Skanda Movie Cast : ఇక 'స్కంద' సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో రామ్‌తో పాటు శ్రీ లీల, ప్రిన్స్ సిసిల్, సయీ మంజ్రేకర్, శరత్ లోహితాశ్వ, దగ్గుబాటి రాజా తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. సంతోష్ దేటేక్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించదా.. శ్రీనివాస చిట్టూరి పవన్ కుమర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
Chandramukhi 2 Movie Collection : మరోవైపు ఈ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్న రాఘవ లారెన్స్ 'చంద్రముఖి-2' కూడా మంచి కలెక్షన్లు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి మూడో రోజు రూ. 5 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాల టాక్. ఇక తొలి రెండు రోజులు ఈ సినిమా రూ.8.25 కోట్లు, రూ. 4.35 కోట్లు వసూళ్లు సాధించింది.