Sivakarthikeyan new movie title: 'డాక్టర్','డాన్' సినిమాలతో భారీ సక్సెస్‌ను అందుకున్నారు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. కోలీవుడ్‌లో కమల్‌హాసన్ 'విక్రమ్' తర్వాత బిగ్హిట్గా డాన్ నిలిచి వంద కోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించింది. ఈ విజయంతో జోరుమీదున్న కార్తికేయన్.. తన కొత్త సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తన 22వ మూవీ టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు.
శివకార్తికేయన్ కొత్త సినిమా టైటిల్ టీజర్ రిలీజ్.. హీరోయిన్గా సామ్! - mahaveeruduga
Sivakarthikeyan new movie title: తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ 22వ సినిమా టైటిల్ టీజర్‌ను సూపర్‌స్టార్ మహేశ్‌బాబు విడుదల చేశారు. యాక్షన్ సీన్స్‌తో మొదలైన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.
మడోన్నే అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి తమిళంలో 'మావీరన్', తెలుగులో 'మహావీరుడు' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. యాక్షన్ టీజర్‌తో టైటిల్‌ను ప్రకటించారు. ఇందులో చేతులు కట్టివేసి ఉండగానే విలన్స్‌తో శివకార్తికేయన్ ఫైట్ చేస్తున్నట్లుగా చూపించారు. అతడి ముఖం కనిపించకుండా చీకట్లో స్టైలిష్‌గా ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించారు. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను తెలుగులో మహేశ్‌బాబు రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా సమంత నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కథ నచ్చడంతో ఈ ముద్దుగుమ్మ అంగీకరించినట్లు సమాచారం. గతంలో ఈ జోడీ 'సీమరాజా' సినిమాలో నటించారు. కార్తికేయన్.. ఈ చిత్రంతో పాటు తెలుగులో 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో 'ప్రిన్స్' చిత్రాన్ని చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్‌తో జాన్వీ, సారా.. రొమాన్స్ చేస్తున్న ఫొటోస్ లీక్!