తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మానసిక క్షోభను అనుభవించాను.. అప్పుడు ఆయనే నన్ను కాపాడారు!: సింగర్ సునీత - సింగర్ సునీత లేటెస్ట్​ న్యూస్

సింగర్ సునీత.. తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే..

singer suneetha
సింగర్ సునీత

By

Published : Sep 17, 2022, 6:30 PM IST

సింగర్‌ సునీత.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధురమైన గాత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. అలా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని తన వివాహ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆమె... కెరీర్​లో ఇప్పటివరకు దాదాపు 120 మంది హీరోయిన్స్​కు డబ్బింగ్ చెప్పారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్​కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత భావోద్వేగానికి గురయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "జీవితంలో నాకు మెంటర్‌ బాల సుబ్రమణ్యం. ఒకానొక సమయంలో ఎంతో డిప్రెషన్‌లోకి జారుకున్నాను. నన్ను మళ్లీ స్ట్రాంగ్‌ చేసిన ఏకైక వ్యక్తి ఆయనే. బాలు గారు అంటే భక్తి, బాలు గారు అంటే అభిమానం, బాలు గారు అంటే జీవితం" అంటూ సునీత కంటతడి పెట్టుకున్నారు.

ఇక రెండో వివాహంపై జరిగిన ట్రోలింగ్‌ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నలకు సునీత బదులిస్తూ.. "నా గురించి మంచి విషయాలు ఉన్నప్పుడు.. ఎందుకు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతారు. సంస్కారవంతులైన వారి లక్షణం ఏంటంటే.. ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఏం మాట్లాడుతాన్నామో ఒకసారి ఆలోచించాలి" అని చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: స్పెషల్​ షోతో బుల్లితెరపై రోజా రీఎంట్రీ.. ఎందులో అంటే?

ABOUT THE AUTHOR

...view details