నాటు పాటలు పాడి రికార్డుల మోత మోగించడంలో రాహుల్ సిప్లిగంజ్ స్టైలే వేరు. ట్రెండ్‌కు తగ్గ తన పాటలతో అలరిస్తూ యూత్‌కు దగ్గరైన ఈ యంగ్ టాలెండెట్ పర్సన్స్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరై తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఇందులో భాగంగానే ఆర్ఆర్ఆర్ మూవీలోని సాంగ్ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని తెలిపాడు. అదేంటో తెలుసుకుందాం..
ఏడాది తర్వాత తెలిసింది.. నాటునాటు పాట నేను, కాలభైరవ కలిసి పాడాం. పాడుతున్నప్పుడు కీరవాణి గారు చాలా ట్యూన్స్ చేస్తారు. అలా ట్యూన్స్‌కు పాడుతున్నప్పుడు ఈ పాట లిరిక్స్‌ను చూసి ఇది ఆర్ఆర్ఆర్ పాట అని అర్థమైంది. ఆ పాట పాడుతున్నప్పుడు 'ఇది ఫైనల్ కాదు.. ట్రాక్ మాత్రమే' అని కీరవాణి గారు చెప్పారు. నేను పాడిన తర్వాత ఏడాదిన్నరకు రిలీజ్ అయింది ఆ పాట. రిలీజ్ అయ్యే వరకు తెలీదు నేను పాడిన పాటే ఫైనల్ అవుతుందని.. విచిత్రం ఏంటంటే తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, హిందీలోనూ నేను పాడిన పాటే సినిమాలో ఉంచారు. తెలుగులో పాడిన తర్వాత వల్లీ మేడం(కీరవాణి సతీమణి) ఫోన్ చేసి ఒకసారి తమిళ్ వెర్షన్‌కు కూడా పాడమన్నారు. అలా మిగతా భాషల్లో కూడా ఓకే అయింది. కీరవాణి గారు నాకు ఈ పాట పాడే అవకాశం ఇవ్వడమే పెద్ద ప్రశంస.
పాట నాది క్రెడిట్ ఇంకొకరిది.. ఓ సారి నేను రచ్చ సినిమాలో 'సింగరేణి ఉంది..' పాట పాడాను. కానీ పేరు మాత్రం వేరే సింగర్‌ది ఉంటుంది. దానికి కారణం.. సినిమా రిలీజ్‌కు 2 రోజుల ముందు నాతో పాడించారు. కానీ అప్పటికే సీడీలపై పేర్లు ప్రింట్ అయ్యాయి.