Chinmayi birth twins: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి, ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్ చేశారు. "ద్రిప్త, శర్వస్... మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు" అని రాసుకొచ్చారు. రాహుల్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
హ్యాపీ మూమెంట్.. కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి - సింగర్ చిన్మయి కవల్ పిల్లలు
Chinmayi birth twins: ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద-నటుడు రాహుల్ రవీంద్ర తల్లిదండ్రులయ్యారు. చిన్మయి పండంటి కవలలకు జన్మనిచ్చారు.
కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ఒకే పరిశ్రమలో వేర్వేరు విభాగాలకు చెందిన ఈ ఇద్దరికీ కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయం ఏర్పడింది. కొంతకాలానికే ప్రేమలో పడిన వీరు.. తమ బంధం గురించి ఇరు కుటుంబాల్లో చెప్పి.. పెద్దల అంగీకారంతో 2014లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
ఇదీ చూడండి: Chor Bazaar: 'బోల్డ్ పాత్రల్లో నటించాలని ఉంది'
Last Updated : Jun 22, 2022, 10:37 AM IST