తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

SIIMA Awards 2023 winners List : బెస్ట్ యాక్టర్స్​గా ఎన్టీఆర్​-శ్రీలీల.. విజేతల పూర్తి జాబితా ఇదే - siima 2023 best director award rajamouli

SIIMA Awards 2023 winners List : రెండు రోజుల పాటు జరగనున్న 'సైమా -2023' అవార్డుల వేడుకలో భాగంగా తొలి రోజు టాలీవుడ్​, కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినవారికి అవార్డులు అందజేశారు. ఎవరెవరికి వచ్చాయంటే?

SIIMA Awards 2023 winners List : విజేతలు వీళ్లే.. బెస్ట్ యాక్టర్​గా ఎన్టీఆర్.. ఇంకా ఎవరెవరు  అందుకున్నారంటే?
SIIMA Awards 2023 winners List : విజేతలు వీళ్లే.. బెస్ట్ యాక్టర్​గా ఎన్టీఆర్.. ఇంకా ఎవరెవరు అందుకున్నారంటే?

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2023, 8:33 AM IST

SIIMA Awards 2023 winners List : సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) - 2023 అవార్డుల వేడుక దుబాయి వేదికగా గ్రాండ్​గా జరిగింది. సెప్టెంబరు 15, 16 తేదీల్లో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. తొలి రోజు వేడుకలో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన నటీనటులను అవార్డులను అందజేశారు. రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులంతా ట్రెండీ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకున్నారు. కథానాయికలు రెడ్‌ కార్పెట్‌పై మెరిశారు. 2023 సంవత్సరానికి గానూ బెస్ట్ యాక్టర్​గా ఎన్టీఆర్‌ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికిగాను ఈ అవార్డు వరించింది. అలాగే ధమకాలో నటనకు శ్రీలీల ఉత్తమ నటిగా, ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి.

ఆ సినిమాకే ఎక్కువగా.. సైమా 2023 అవార్డుల్లో ఎక్కువ విభాగాల్లో నామినేషన్​ దక్కించుకున్న ఆర్​ఆర్​ఆర్​ చిత్రమే అవార్డులను కూడా అందుకుంది. బెస్ట్ యాక్టర్​, బెస్ట్ డైరెక్టర్​, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్​, ఉత్తమ సినిమాటోగ్రాఫర్, ఉత్తమ గేయ రచయిత విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు దక్కాయి. దీని తర్వాత ఫీల్ గుడ్ లవ్ స్టోరీ 'సీతా రామం' చిత్రానికి మూడు విభాగాల్లో అవార్డులు వరించాయి.

సైమా విజేతలు తెలుగు..

  • ఉత్తమ నటుడు: ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
  • ఉత్తమ దర్శకుడు: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్‌)
  • ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్‌)
  • ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
  • ఉత్తమ విలన్‌: సుహాస్‌ (హిట్‌2)
  • ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
  • ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
  • ఉత్తమ పరిచయ నటి: మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
  • ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్ఆర్‌)
  • ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్‌ (నాటు నాటు, ఆర్​ఆర్​ఆర్​)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్‌ మిర్యాల (డీజే టిల్లు)
  • ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
  • సెన్సేషన్‌ఆఫ్‌ ది ఇయర్‌ : నిఖిల్‌, కార్తికేయ2
  • ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడవి శేష్‌ (మేజర్‌)
  • ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
  • ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
  • ప్రామిసింగ్‌ న్యూకమర్‌ (తెలుగు): బెల్లంకొండ గణేష్‌

ABOUT THE AUTHOR

...view details