SIIMA Awards 2023 nominations : సౌత్ సినీ ఇండస్ట్రీలో అవార్డుల పండగకు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(SIIMA) 2023 అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
తాజాగా నామినేషన్లను మొదలు పెట్టారు ఈవెంట్ నిర్వాహకులు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన వారికి ఈ సైమా పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇటీవలే బెస్ట్ మూవీ నామినేషన్ లిస్ట్‌ను ప్రకటించిన మేకర్స్.. ఇప్పుడు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో బెస్ట్ డైరెక్టర్ల నామినేటెడ్ జాబితాను విడుదల చేశారు.
SIIMA Awards 2023 nominations list telugu : ఈ జాబితాలో 'కార్తికేయ 2' సినిమాకుగానూ చందు మొండేటి, సీతారామం చిత్రానికిగాను హను రాఘవపూడి, ఆర్ఆర్ఆర్ సినిమాకుగానూ దర్శకధీరుడు రాజమౌళి, మేజర్ సినిమాకు గాను శశి కిరణ్ తిక్క, డీజే టిల్లు చిత్రానికిగాను విమల్‌లను నామినేట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. తెలుగులో బెస్ట్ మూవీస్ విభాగంలో 'ఆర్ఆర్ఆర్', సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు', నిఖిల్ సిద్దార్థ్ 'కార్తికేయ 2', అడవి శేష్ 'మేజర్', దుల్కర్ సల్మాన్ 'సీతారామం' చిత్రాలను నామినేట్ చేశారు. ఇప్పుడా సినిమా దర్శకులనే బెస్ట్ డైరెక్టర్ అవార్డుకు నామినేట్ చేయడం విశేషం.