SIIMA 2023 Nominations: సినీ ఇండస్ట్రీలో దక్షిణాదిలో ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకకు సర్వం సిద్ధమైంది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)- 2023లో పోటీపడే చిత్రాల జాబితా రిలీజ్ అయింది. అయితే అవార్డుల నామినేషన్స్‌లో టాలీవుడ్ బ్లాక్ బస్టర్, ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 11 విభాగాల్లో స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానంలో 10 విభాగాల్లో నామినేషన్స్‌తో సీతారామం చిత్రం నిలిచింది.
సెప్టెంబర్ 15, 16 తేదీల్లో అట్టహాసంగా..
SIIMA Awards 2023 Telugu Nominations : ఉత్తమ చిత్రం కేటగిరీలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన RRR, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు, యంగ్ హీరోలు నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ2, అడవి శేష్ మేజర్‌లతో పాటు డీసెంట్ బ్లాక్‌బస్టర్ సీతారామం పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 15, 16 తేదీల్లో.. దుబాయ్‌లోని డీడబ్ల్యూటీసీలో సైమా వేడుకలు.. అట్టహాసంగా జరగనున్నాయి.