SIIMA 2023 Awards NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో ఘనతను అందుకున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న సైమా 2023లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' చిత్రంకుగానూ తారక్.. ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్టేజ్ ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. మరోసారి అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేశారు.
అవార్డు అందుకున్న తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ.. 'కొమరం భీమ్ పాత్రకు నన్ను మళ్ళీ మళ్ళీ మళ్లీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్. నా కో స్టార్, మై బ్రదర్, ఫ్రెండ్ రామ్ చరణ్‌కు కూడా ధన్యవాదాలు. నా అభిమానులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఒడిదుడుకుల్లో నేను కింద పడ్డప్పుడల్లా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు... నా కళ్ల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకు వాళ్ళు కూడా బాధ పడినందుకు... నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు... నా అభిమాన సోదరులు అందరికీ పాదాభివందనాలు చేసుకుంటున్నాను.'' అని తారక్ భావోద్వేగంగా మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కాగా, 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీముడిగా కనిపించారు. ఈ పాత్రలో ఆయన అద్భుతంగా నటించి కంటతడి పెట్టించారు. యాక్షన్ సీన్స్‌లో వీరోచితంగా కనిపిస్తూనే.. ఎమోషనల్ సీన్స్‌లో ప్రేక్షకుల చేత ఏడ్పించేశారు. ముఖ్యంగా 'కొమురం భీముడో' సాంగ్‌లో ఆయన అభినయం ప్రతి ప్రేక్షకుడి గుండెను పిండేసింది. ఆ నటనకుగాను ఇప్పుడాయన సైమా పురస్కారాన్ని దక్కించుకున్నారు.