Siddu Jonnalagadda New Movie : 'గుంటూరు టాకీస్', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నల గడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు.. స్టార్ డిజైనర్ నీరజ కోనతో ఓ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.
Siddu Jonnalagadda Neeraj Kona Movie : తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. 'తెలుసు కదా' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. 'జీవించడానికి ఉన్న ఒకే ఒక దారి.. ప్రేమించడం, ప్రేమించబడటం' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కేజీయఫ్ భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్‌గా నటిస్తున్నట్లు తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్‌కు ఇది 30వ సినిమా కావడం విశేషం. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా, వివేక్ కుచిబొట్ల కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇకపోతే వీడియోలో విజువల్స్ ఎంతో రిచ్‌గా, గ్రాండ్‌గా చూపించారు. ఓ పెద్ద ప్యాలెస్ అందులో సిద్ధు జొన్నల్లగడ్డ టాప్ టు బాట్ వైట కలర్ సూట్ ధరించి ఎంతో క్లాస్‌గా స్టైలిష్‌గా నడుస్తూ కనిపించారు. వీడియో చివర్లలో 'తెలుసు కదా' అంటూ చెబుతూ మూగించారు. ఈ వీడియో చూస్తుంటే సినిమా మంచి రిఫ్రెషింగ్ స్టోరీ లైన్‌తో రాబోతుందని అర్థమవుతోంది. అలాగే టాప్ క్లాస్ స్టాండర్డ్స్‌తో తెరకెక్కబోతుందని కూడా తెలుస్తోంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనసును తాకేలా ఎంతో వినసొంపుగా అనిపించింది. ఇంకా ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనుండటం విశేషం. అనివాశ్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు చూసుకుంటుండగా.. యువరాజ్ జే డీఓపీ అందిస్తున్నారు.
కాగా, టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచమైన ఆమె నీరజ కోన. బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని శారు. ఇప్పుడామె దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.