తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

Siddharth Insulted : హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం.. ప్రెస్ మీట్ మధ్యలోనే బలవంతంగా ఎలా పంపించేశారో చూడండి - సిద్ధార్థ్​కు చేదు అనుభవం

Siddharth Insulted : హీరో సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన సినిమా కార్యక్రమానికి నిరసన సెగ తాకింది. ప్రెస్ మీట్ మధ్యలోనే బలవంతంగా పంపించేశారు.

Siddharth Insulted : హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం.. ప్రెస్ మీట్ మధ్యలోనే బలవంతంగా ఎలా పంపించేశారో చూడండి
Siddharth Insulted : హీరో సిద్ధార్థ్​కు ఘోర అవమానం.. ప్రెస్ మీట్ మధ్యలోనే బలవంతంగా ఎలా పంపించేశారో చూడండి

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 10:56 PM IST

Siddharth Insulted :ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన లేటెస్ట్ మూవీ కోసం ఆయన ప్రమోషన్స్​ చేస్తూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొనగా అక్కడ ఆయనకు నిరసన సెగ తగిలింది. విలేకర్ల సమావేశాన్ని అడ్డుకున్న నిరసనకారులు.. సిద్ధార్థ్‌ను అక్కడి నుంచి పంపించేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే... హీరో సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా 'చిన్నా'. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎమోషనల్​గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28) రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్​.. తాజాగా కర్ణాటకలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే.. కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్‌ ఆపేయాలని గొడవ చేశారు. నువ్వు తమిళోడివి.. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ సిద్ధార్థ్​ను అన్నారు. ఆ రాష్ట్రంలో నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో... తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై ఆందోళకారులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వెంటనే నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.

ఇక నిరసన కారులు గట్టిగా బలవంతం చేయడంతో.. సిద్ధార్థ్ చేసేదేమి లేక.. అక్కడి నుంచి సైలెంట్​గా వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు.. ఇలా జరగడం బాధాకరమైన విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓ హీరోను ఇలా అవమానించడం సరికాదంటూ అభిప్రాయాలు వ్యకం చేస్తున్నారు.

Siddharth New Movie :కాగా, చిన్నా సినిమా విషయానికొస్తే... బాబాయికి.. చిన్నారికి మధ్య జరిగే ఓ ఎమోషనల్ డ్రామానే ఈ సినిమా కథ. అంతా సాఫీగా సాగుతున్న లైఫ్​లో అకస్మాతుగా చిన్నారి కిడ్నాప్​కు గురవ్వడం.. ఆమెను కాపాడుకునేందుకు సిద్ధార్థ్‌ చేసే పోరాటమే ఈ కథ. మరి ఈ కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది తెలుసుకోవాలంటే సినిమాను చూడాల్సిందే. ఇకపోతే గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ్​.. ఈ చిత్రంతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి..

ABOUT THE AUTHOR

...view details