Siddharth Aditi Marriage :ప్రముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరి రిలేషన్షిప్లో ఉన్నారని కొన్నాళ్ల నుంచి ప్రచారం సాగుతోంది. డేటింగ్లో ఉన్నారు అని వార్తలు వచ్చాయి. దానికి తోడు పలుమార్లు ఈ జంట ముంబయి వీధుల్లో ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. రెస్టారెంట్స్, పలు ఈవెంట్స్‌కు వీరిద్దరూ కలిసి వెళ్లడం, రీల్స్ చేశారు. అంతేకాకుండా పుట్టిన రోజులకు స్పెషల్ విషెష్ చెప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అయినా అలాంటిదేమీ లేదని తాము మంచి స్నేహితులమంటూ ఇప్పటికే పలుమార్లు సిద్ధార్థ్, అదితి చెప్పారు. కానీ తాజాగా అదితి పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్ట్ వీరి పెళ్లి క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ క్లోజ్‌గా దిగిన ఓ ఫొటోను ఇద్దరూ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో ఈ సెలబ్రిటీ జంట తన రిలేషన్‌షిప్‌ను కన్ఫాఫ్ చేశారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఫొటోగ్రాఫర్లకు సిద్ధార్థ్ వార్నింగ్!
అయితే 2022లో అదితితో సిద్ధార్థ్ ముంబయి వీధుల్లో దర్శనం ఇచ్చారు. నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో సందడి చేశారు. రెస్టారెంట్ నుంచి బయటకు వస్తోన్న వీరిని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు ప్రయత్నించగా వారిపై సిద్ధార్థ్ అసహనం వ్యక్తం చేశాడు. 'నేను ఇక్కడి వాడిని కాదు. ఇక్కడివారిని ఫొటోలు తీసుకోండి. ఇప్పుడు సున్నితంగా చెబుతున్నా. తర్వాత వేరేలా ఉంటుంది' అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.