Balakrishna Gopichand malineni movie: నటసింహం నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం 'ఎన్బీకే107'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రుతిహాసన్ హీరోయిన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో తాజాగా సెట్స్‌లోకి అడుగుపెట్టారు శ్రుతిహాసన్. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు గోపిచంద్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. "అత్యంత ప్రతిభావంతురాలు, నా ఫేవరెట్ శ్రుతిహాసన్ సెట్స్‌లో అడుగుపెట్టారు. షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది" అని వ్యాఖ్య రాసుకొచ్చారు.
NBK 107 అప్డేట్: నా ఫేవరెట్ హీరోయిన్ వచ్చేసిందంటూ డైరెక్టర్ ట్వీట్.. - shrutihassan join sets balakrishna movie
Balakrishna Gopichand malineni movie: గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్బీకే 107' సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు హీరోయిన్ శ్రుతిహాసన్. దీనికి సంబంధించిన ఫొటోను దర్శకుడు గోపిచంద్ ట్వీట్ చేశారు.
కాగా, 'అఖండ' సినిమాలో తన బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్‌తో నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించిన తమన్.. 'ఎన్బీకే 107' చిత్రానికీ బాణీలు అందిస్తున్నారు. కన్నడ హీరో దునియా విజయ్ విలన్‌గా కనిపించబోతున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఫస్ట్ హంట్ పేరుతో విడుదలైన టీజర్లో మాస్ డైలాగులు, స్క్రీన్ ప్రెజన్స్‌తో ఈలలు వేయిస్తున్నారు బాలయ్య.
ఇదీ చూడండి: కెమెరా అసిస్టెంట్‌గా జర్నీ స్టార్ట్.. ఇప్పుడు జబర్దస్త్, సినిమాలతో ఫుల్ బిజీ!