తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'సలార్‌' షూట్​ను కంప్లీట్​ చేసిన శ్రుతి హాసన్​.. ఇక ఆద్యగా థియేటర్లలో... - ప్ర

స్టార్​ హీరోయిన్​ శ్రుతి హాసన్ సలార్ షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా మూవీ టీమ్​కు ధన్యావాదాలు తెలిపింది. ముఖ్యంగా దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో ప్రభాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Shruti Haasan wrapped Salaar
Shruti Haasan

By

Published : Feb 24, 2023, 6:40 AM IST

Updated : Feb 24, 2023, 8:26 AM IST

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్​ ఫిల్మ్ 'సలార్'​. పాన్​ ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో ఆద్యగా నటిస్తున్న హీరోయిన్​ శ్రుతి హాసన్​​ షూటింగ్​లో భాగంగా తన షూట్​ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మూవీ టీమ్​కు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఈ 'సలార్​' తార.. సెట్​లో తీసుకున్న ఓ ఫొటోను షేర్​ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

అందులో శ్రుతితో పాటు సలార్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​, సినిమాటోగ్రాఫర్​ భువన గౌడలు ఉన్నారు. "నన్ను మీ ఆద్యగా మార్చుకున్నందుకు ప్రశాంత్‌ నీల్‌కు థ్యాంక్స్​.అలాగే డార్లింగ్‌ ప్రభాస్‌కు ధన్యవాదాలు. మీ అందరితో కలిసి ఈ ప్రత్యేకమైన చిత్రంలో పని చేయడం చాలా బాగుంది. చివరికి నిజంగా ఓ కుటుంబంలా అనిపించింది" అంటూ ఇన్​స్టాలో పోస్ట్​ కింద రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

కాగా పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్​ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్​ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. కేజీఎఫ్​ డైరక్టర్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహిస్తున్నారు. విన్నూత్నమైన యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్​, శ్రుతి హాసన్​తో పాటు మలయాళ హీరో పృథ్వీ రాజ్​ సుకుమారన్​, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్​ జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్​ 28న థియేటర్లలో సందడి చేయనుంది.

Last Updated : Feb 24, 2023, 8:26 AM IST

ABOUT THE AUTHOR

...view details