Shruti Haasan Wedding :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ పెళ్లికి సంబంధించిన విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమెకు పెళ్లైందంటూ ఇదివరకు కొన్ని వార్తలు రాగా, తాజాగా ఇదే విషయానికి సంబంధించిన పలు వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్హాన్ అవత్రమణి (ఓరీ), శ్రుతిహాసన్‌కు పెళ్లైందని ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చాడని వెబ్సైట్లు కథనాల్లో పేర్కొన్నాయి. ఇక ఈ విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె అన్నారు.' నాకు ఇంకా పెళ్లి కాలేదు. ప్రతీ చిన్న విషయాన్ని అందరితో షేర్ చేసుకునే నేను పెళ్లి విషయం ఎందుకు దాస్తాను? నాకైతే తెలీదు మరి. కామ్ డౌన్' అని ఆమె అన్నారు.
దీంతో 'ఇలాంటి వాటిపై మీరు ఎందుకు స్పందించడం' అని ఫ్యాన్స్ కామెంట్స్ చేసి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే కొంతకాలంగా ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో శ్రుతిహాసన్ ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఇక ఈ జంట రీసెంట్గా దీపావళి పండగ కూడా సెలబ్రేట్ చేసుకుంది.
కాగా, రీసెంట్గా శ్రుతిహాసన్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'సెల్ఫ్ క్వశ్చన్'(Question About Your Self) సెషన్‌ను షేర్ చేశారు. ఈ సెషన్లో పలు ప్రశ్నలకు ఆమె సమాధానచ్చారు. ఇందులో భాగంగా ఆమె ఫస్ట్ జాబ్ గురించి ప్రశ్నరాగా, 'డబ్బింగ్ ఆర్టిస్ట్', 'కాస్టింగ్ అసిస్టెంట్', 'లైబ్రరియన్'గా పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇక ఆమె వ్యక్తిగత విషయాల గురించి పేరెంట్స్, బెస్ట్ ఫ్రెండ్స్‌కు మాత్రమే తెలుసన్న శ్రుతి, 'ఫ్రూటీ' అనేది తన చిన్నానాటి ముద్దుపేరు (Nickname) అని చెప్పుకొచ్చారు.