Shraddha Walker Case Movie: దేశవ్యాప్తంగా శ్రద్ధా వాకర్ హత్యకేసు సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతుండడం వల్ల షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ హత్య కేసులో ఆధారాల సేకరణ దర్యాప్తు అధికారులకు క్లిష్టంగా మారింది. 35 శరీర భాగాల్లో ఇప్పటికే 13 వరకు దొరికాయి. వాటికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి అవి శ్రద్ధావో కాదో తేల్చాలి. ఇక మిగతా భాగాలు కనిపిస్తే తెలియజేయండంటూ.. పోలీసు ఉన్నతాధికారులు వివిధ పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, శ్రద్ధా వాకర్ హత్య కేసు సినిమాగా తెరకెక్కనుంది.
తెరపైకి శ్రద్ధా వాకర్ హత్య కేసు.. లవ్జిహాదే టార్గెట్‌గా.. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ షురూ
దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన దిల్లీలోని శ్రద్ధా వాకర్ ఉదంతం సినిమాగా రూపొందనుంది. బాలీవుడ్ దర్శకుడు మనీశ్ సింగ్.. శ్రద్ధ హత్య కేసును సినిమాగా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. అందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు.
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు మనీష్ సింగ్.. శ్రద్ధా వాకర్ హత్య కేసుపై సినిమా తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి పనులను కూడా ఆయన ప్రారంభించినట్లు తెలిపారు. లవ్‌జిహాద్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని వెల్లడించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న ప్రేమ పిశాచీల గురించి సినిమాలో చూపించనున్నట్లు స్పష్టం చేశారు.
బృందావన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు మనీశ్ సింగ్. ఈ సినిమా టైటిల్‌ను 'హూ కిల్డ్ శ్రద్ధా వాకర్'గా ఆయన ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దిల్లీ చుట్టుపక్కల అడవుల వీడియో క్లిప్‌లపై పరిశోధన బృందాన్ని ఆయన ఏర్పాటు చేశారు. దీంతో పాటు షూటింగ్ లొకేషన్స్ కోసం ఆయన పలు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.