తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

డ్రగ్స్​ కేసు.. స్టార్​ హీరోయిన్ శ్రద్ధాకపూర్​​ సోదరుడు అరెస్ట్​ - Shraddha kapoor

Drugs Case Siddhanth kapoor: సినీ ఇండస్ట్రీలో మారోసారి డ్రగ్స్​ వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు ఓ రేవ్​ పార్టీపై దాడి చేసి బాలీవుడ్ స్టార్​ హీరోయిన్​ శ్రద్ధాకపూర్​ సోదరుడు, నటుడు సిద్ధాంత్​ కపూర్​ను అరెస్ట్​ చేశారు.

Shraddha kapoor brother arrerst in drug case
డ్రగ్స్​ కేసు

By

Published : Jun 13, 2022, 10:08 AM IST

Updated : Jun 13, 2022, 10:41 AM IST

Drugs Case Siddhanth kapoor: సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం​ మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ఈ మాదక ద్రవ్యాల కేసులో విచారణలు ఎదుర్కొంటుండగా.. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్​ శ్రద్ధాకపూర్​ సోదరుడు, నటుడు సిద్ధాంత్​ కపూర్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని ఓ హోటల్​లో జరిగిన రేవ్​ పార్టీపై రైడ్​ చేసిన అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడితో పాటు మరో ఐదుగురిని అరెస్ట్​ చేసినట్లు తెలిసింది. వీరంతా ఆ సమయంలో డ్రగ్స్​ తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు.

కాగా, నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో డ్రగ్స్​ వ్యవహారం వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించింది. ఇందులో భాగంగా నార్కోటిక్స్​ కంట్రోల్​ బ్యూరో ప్రశ్నించిన వారిలో శ్రద్ధాకపూర్​ కూడా ఉన్నారు. అనంతరం గతేడాది ముంబయి తీరంలోని ఓ క్రూజ్‌ నౌకలో మాదక ద్రవ్యాలు లభించడం.. అదే నౌకలో షారుక్​ ఖాన్ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ ఉండటం సంచలనంగా మారింది. ఈ కేసులో అరెస్ట్​ అయిన ఆర్యన్ ఖాన్‌కు ఇటీవలే క్లీన్‌చిట్‌ లభించింది.

ఇదీ చూడండి: ఆమిర్ 'త్రిబుల్​' ధమాకా​.. టైమ్స్‌స్క్వేర్‌లో 'రాకెట్రీ' ట్రైలర్​

Last Updated : Jun 13, 2022, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details