Shobu Yarlagadda On Salaar Promotions :పాన్ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' రీలీజ్‌కు ముందు ఇండస్ట్రీలో సినిమా ప్రమోషన్స్ గురించి విపరీతమైన చర్చ నడిచింది. విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటకీ మూవీటీమ్ ఎలాంటి హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ విషయంలో అటు ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ చెందారు. ఆఖర్లో దర్శకధీరుడు రాజమౌళి గెస్ట్‌గా చేసిని ఓ స్పెషల్ ఇంటర్వ్యూతో ఫ్యాన్స్ కాస్త హ్యాపీ ఫీలయ్యారు. ఈ ఇంటర్వ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ గురించి బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభూ యార్లగడ్డ రీసెంట్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
నిర్మాత శోభూ యార్లగడ్డ రీసెంట్గా ఫిల్మ్ మేకర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ మీటింగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదన్న ఆయన, బాలీవుడ్లో మాత్రం కాస్త ప్రమోట్ చేసి ఉంటే వసూళ్లు పెరిగేవని అభిప్రాయం వ్యక్త పరిచారు. రిలీజ్‌కు ముందే సినిమా ఎలా ఉండనుందోనని నార్త్‌లో పరియచం చేయాల్సిందని ఆయన అన్నారు.
Salaar Box Office Collection: తొలి వారం విజయవంతం చేసుకున్న సలార్ సెకండ్ వీక్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 30న రూ.12.50 కోట్లు వసూల్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా సలార్ ఇప్పటివరకు రూ.329.62 కోట్లు కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక డిసెంబర్ 31, న్యూ ఇయర్ హాలీడే వీకెండ్లో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.