Shine Tom Chacko Wedding :ప్రముఖ మలయాళ నటుడు, 'దసరా' విలన్ షైన్ టామ్ చాకో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ మేరకు ఫేమస్ మోడల్ తనూజ- టామ్ చాకో నిశ్చితార్థం జనవరి 1న జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ ఎంగేజ్‍మెంట్ వేడుకకు సంబంధించిన ఫొటోలను చాకో మంగళవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. చాలా మంది సినీ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు చెప్పారు. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ జంటకు విషెస్ చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.
కొన్నాళ్ల నుంచి చాకో, తనూజా లవ్‍లో ఉన్నారని రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ కొద్ది రోజుల క్రితం తనూజాతో తన రిలేషన్షిప్ను ప్రకటించారు చాకో.
Shine Tom Chacko Movies :షైన్ టామ్ చాకో కొన్నాళ్లు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలకు పనిచేశారు. ఆ తర్వాత 2011లో 'గడ్డమ' అనే చిత్రంలో నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పలు చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి మలయాళ ప్రేక్షకులను అలరించారు. విలక్షణ నటుడిగా చాకో పేరు తెచ్చుకున్నారు. అలా తమిళ దర్శకుల కళ్లలో పడి 'బీస్ట్'తో చిత్రంలో నటించే అవకాశం సంపాదించాడు.