తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'షూట్‌కు వెళ్తున్నానంటే ఇంట్లోవాళ్లూ కంగారుపడేవాళ్లు' - ఒకే ఒక జీవితం అమల ఇంటర్వ్యూ

నటి అమల, హీరో శర్వానంద్​ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి టాక్​ సంపాదించుకుంది. దీంతో చిత్ర బృందం థ్యాంక్యూ మీట్​ నిర్వహించింది. ఈ సందర్భంగా సినిమా గురించిన విషయాలను శర్వానంద్ షేర్​ చేసుకున్నారు.

sharwanand
sharwanand about oke oka jeevitham

By

Published : Sep 10, 2022, 8:50 PM IST

తల్లి-కొడుకు సెంటిమెంట్‌తో సిద్ధమైన చిత్రం 'ఒకే ఒక జీవితం' . శర్వానంద్, వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అమల కీలకపాత్ర పోషించారు. సాయి కార్తిక్‌ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతటా మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో 'ఒకే ఒక జీవితం' టీమ్‌ థ్యాంక్యూ మీట్‌ నిర్వహించింది. ఇందులో శర్వానంద్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చేస్తున్నప్పుడు తాను మానసిక ఆందోళనకు గురైనట్లు చెప్పారు. కుటుంబసభ్యులు సైతం తన విషయంలో కంగారుపడ్డారని ఆయన చెప్పుకొచ్చారు.

"మా చిత్రానికి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా హిట్‌ అవుతుందా? ఎంత వసూళ్లు రాబడుతుంది? అనేది నేను చెప్పలేను కానీ థియేటర్లలో ప్రేక్షకులందరూ సినిమా పూర్తైన వెంటనే లేచి నిల్చొని చప్పట్లు కొడుతున్నారు. అది చూసిన క్షణం నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. నా చుట్టూ ఉన్న వాళ్లందరూ నేను సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నారు. అక్కడే సక్సెస్‌ అయ్యాను. ఇలాంటి అద్భుతమైన కథలో నన్ను భాగం చేసిన మా దర్శకుడికి ధన్యవాదాలు. ఇన్నాళ్లు విజయం లేకపోవడంతో ఎంతో భారంగా అనిపించింది. కానీ, ఈ సినిమాతో నా బరువు దిగిపోయింది. ఇలాంటి కథలు రాస్తే చేస్తారా? లేదా? అనే సందేహాలు వదిలేయండి. అమల మేడమ్‌.. మీతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మీరు మరెన్నో చిత్రాల్లో నటించాలి" అని శర్వానంద్‌ పేర్కొన్నారు.

ఈ సినిమాకి రివ్యూలు ఎలా వచ్చాయో చూసుకున్నారా?
శర్వానంద్‌: రివ్యూలు చదవలేదు. రేటింగ్స్‌ మాత్రం చూశా.
మీరు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం చేసేటప్పుడు భయపడలేదా?
శర్వానంద్‌:దర్శకుడు కథ చెప్పిన మొదటిరోజే ఈ సినిమా విజయం అందుకుంటుందని నమ్మాను. దానివల్ల నేను భయపడలేదు. కాకపోతే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో "ఇకపై మిమ్మల్ని నిరాశపర్చను. తప్పకుండా ఈసినిమా మీకు నచ్చుతుంది" అని ప్రేక్షకులకు మాటిచ్చా. దానివల్ల ప్రేక్షకులకు నచ్చుతుందో లేదోనని బాగా భయపడ్డా.
కంటెంట్‌ ఉంటేనే సినిమా హిట్‌ అందుకుంటుందని నమ్ముతున్నారా?
శర్వానంద్‌: 200 శాతం. కంటెంట్‌, స్టోరీనే కింగ్‌.

గతంలో మీరు నటించిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌' చూసి నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవల 'ఒకే ఒక జీవితం' చూసి ఆయన మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జునను ప్రతిసారీ మీరెందుకు భావోద్వేగానికి గురి చేస్తున్నారు?
అమల:అమ్మ ఎప్పుడూ మనతోనే ఉండిపోదు కదా. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరికీ వాళ్ల అమ్మ గుర్తుకువచ్చింది. అలాగే, నాగ్‌ కూడా వాళ్లమ్మని గుర్తుచేసుకున్నారు. ఎమోషనల్‌ అయ్యారు.

ఈ సినిమా చేయడానికి, మిగిలిన సినిమాలు చేయకపోవడానికి కారణం ఏమిటి?
అమల: ఈ కథ విన్నాక తప్పకుండా సినిమా చేయాలనిపించింది. అందుకే చేశా. మిగిలిన వాటికి అలాంటి అనుభూతి రాలేదు.
ఈ సినిమాలో మీ రోల్‌ ఆద్యంతం ఫుల్‌ సీరియస్‌గా ఉంటుంది. ఆ రోల్‌ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?
శర్వానంద్‌: ఈ సినిమా నన్నెంత గానో భావోద్వేగానికి గురి చేసింది. ఒకానొక సమయంలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. ఆరోజు షూట్‌ కూడా క్యాన్సిల్‌ చేసుకుని ఇంటికి వెళ్లిపోయా. కౌన్సిలింగ్‌కు వెళ్లి వచ్చా. షూట్‌కి వెళ్తున్నానంటే ఇంట్లోవాళ్లూ కంగారుపడేవాళ్లు.

ఇవీ చదవండి:విక్రమ్@100 రోజులు.. కమల్​ వాయిస్​ ట్వీట్​ వైరల్​!

పింక్​ సూట్​లో యాంకర్ శ్రీముఖి హాట్​ ఫొటోషూట్​

ABOUT THE AUTHOR

...view details