బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం బాలీవుడ్‌కి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తోంది. విడుదలకు మందే పలు రికార్డులు సాధించిన ఈ చిత్రం సెన్షేషనల్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. రిలీజైన తొలి మూడు రోజుల్లోనే అటు ఇండియాలో ఇటు ఓవర్సీస్లో కలిసి వరల్డ్ వైడ్‌గా అత్యధిక స్థాయిలో కలెక్షన్లు అందుకుని రికార్డుకెక్కింది.
విడుదల ముందు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో వివాదాలను ఎదుర్కొన్నా ఈ చిత్రం.. ఇప్పుడు వారి నోళ్లను మూయిస్తోంది. తమ కలెక్షన్లతో వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా బాయ్‌కాట్ గ్యాంగ్‌కు హడల్ పుట్టిస్తోంది. తొలి రోజు మతిపోగొట్టే ఓపెనింగ్స్ కలెక్షన్స్‌ను అందుకున్న ఈ మూవీ.. మూడు రోజులు పూర్తయ్యే సరికి శుక్రవారం నాటికి అంతకుమించిన రేంజ్లో వసూళ్లను సాధించింది. వరల్డ్ వైడ్‌గా దాదాపు రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఓవర్సీస్లో రూ.100కోట్లకు పైగా గ్రాస్‌ను సాధించింది. ఓవర్సీస్లో షారుక్ సినిమాలు రూ.100కోట్లకు పైగా వసూలు చేయడం ఇది పన్నెండో సారి. నాన్ హాలీడేస్‌లోనే ఈ రేంజ్లో పఠాన్ ఇంత వసూలు చేస్తే ఇక ఈ రెండు రోజులు హాలిడేస్ కాబట్టి మరో రూ.200 కోట్లు సాధించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే ఐదు రోజుల్లోనే రూ.500కోట్లు వస్తాయని చెబుతున్నారు.