Sharukh khan: సాధారణంగా తమ అభిమాన నటులు, హీరోహీరోయిన్లు కనిపిస్తే ఫ్యాన్స్‌కు వచ్చే ఉత్సాహమే వేరు. సెల్ఫీలు అంటూ ఎగపడతారు. కొన్ని సందర్భాల్లో తెలీకుండానే సెలబ్రిటీలను ఇబ్బందికీ గురిచేస్తారు. ఒక్కోసారి వారి అభిమానం చూసి తారలు తప్పించుకుంటుంటారు. అయితే తాజాగా షారుక్ కూడా ఇదే అనుభవం ఎదురైంది. ఫ్యాన్స్‌ను చూసిన బాలీవుడ్ బాద్షా.. ఒక్కసారిగా వారి నుంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి కారులో కూర్చున్నారు.
గుర్తుపట్టిన ఫ్యాన్స్.. భయంతో పరిగెత్తిన షారుక్! - ఫ్యాన్స్ చూసి పరుగెత్తిన షారుక్
Sharukh khan: తనను చూసి గుర్తుపట్టిన ఫ్యాన్స్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ఈ క్రమంలోనే పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, షారుక్ ఖాన్‌కు ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే గత నాలుగేళ్ల నుంచి తెరకు దూరమైన ఆయన.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే షారుక్.. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరాణీతో కలిసి 'డంకీ' మూవీ కోసం లండన్‌లో షూటింగ్లో పాల్గొన్నారు. ఆ షూటింగ్ స్పాట్లో ఆయన్ను గుర్తుపట్టిన అక్కడి వారు సెల్ఫీల కోసం షారుక్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన బాద్షా త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్లి తన కారులో కూర్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఉంది షారుక్ కాదని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. బాద్షా అంత పొట్టిగా ఉండరని అంటున్నారు.
ఇదీ చూడండి: 'క్యాష్‌లో సుమ కూతురి సీక్రెట్ ఎంట్రీ.. వారికి రూ.లక్షల సాయం!'