బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. 'పఠాన్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఐదేళ్ల క్రితం 'జీరో' సినిమాతో థియేటర్లలో సందడి చేసిన షారుక్.. పలు కారణాలతో గ్యాప్ తీసుకున్నారు. కరోనా మహమ్మారి కూడా ఆయనను సినిమాలకు కాస్త దూరంగా ఉండేలా చేసింది. ఎట్టకేలకు యాక్షన్ థ్రిల్లర్‌తో ఆయన మళ్లీ థియేటర్లలోకి రానున్నారు.
పఠాన్‌కు షారుక్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లా?.. దీపికకు ఎంతంటే? - pathan sharukh khan
'పఠాన్' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న షారుక్ ఖాన్ రెమ్యునరేషన్‌పై సోషల్‌మీడియాలో జోరుగా చర్చు నడుస్తోంది. షారుక్ రూ.100 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు..
అయితే 'పఠాన్' మూవీకి షారుక్ ఖాన్ తీసుకున్న రెమ్యునరేషన్‌పై బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కినట్లు వార్తలు వస్తుండగా.. షారుక్ రెమ్యునరేషన్ రూ.100 కోట్లు అని టాక్ నడుస్తోంది. అలానే ఈ మూవీలో షారుక్‌కు జోడీగా నటించిన దీపికా పదుకొణెకి రూ.15 కోట్లు, నెగటివ్ రోల్ పోషించిన జాన్ అబ్రహాంకి రూ.20 కోట్ల వరకూ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
2022లో వరుస ప్లాప్‌లను చూసిన బాలీవుడ్.. షారుక్ ఖాన్ సినిమాపై గంపెడాశలు పెట్టుకుంది. మరీ ముఖ్యంగా గత ఏడాది పెద్ద సినిమాల్ని సైతం దెబ్బతీసిన 'బాయ్‌కాట్ బాలీవుడ్' ట్రెండ్ మళ్లీ తెరపైకి రాకూడదని జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలోనే బేషరమ్ రంగ్ సాంగ్ వివాదాన్ని కొన్ని సీన్స్‌ను కట్ చేయడం ద్వారా షారుక్ సర్దుమణిగేలా చేసినట్లు తెలుస్తోంది.