ఎన్నో వివాదాలు, అంతకు మించిన ఆకర్షణలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చిత్రం షారుక్ ఖాన్ 'పఠాన్'. ఓ వైపు బాయ్‌కాట్ పిలుపులు.. మరోవైపు బాక్సాఫీసును బద్దలుకొట్టేలా టికెట్ల అడ్వాన్స్ బుకింగులు.. ఇలా వీటన్నిటీ మధ్య ఫైనల్‌గా థియేటర్లలోకి వచ్చేశారు బాద్ షా. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత.. భారీ అంచనాలతో వందకు పైగా దేశాల్లో దాదాపు ఏడు వేల స్క్రీన్లలో సందడి చేశారు. అందాల తార దీపికా పదుకొణెతో కలిసి సిల్వర్‌స్క్రీన్‌ను షేక్ చేసేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు. థియేటర్ల బయట రచ్చరచ్చ చేస్తున్నారు. భారీ కటౌట్లతో హాళ్ల ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ షో చూసి వచ్చిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కథ, కథనాలను అస్సలు ఊహించని విధంగా ఉందని అంటున్నారు. 'కింగ్ ఈజ్ బ్యాక్' అని పోస్ట్‌లు పెడుతున్నారు.
పఠాన్ ట్రైలర్ చూసి కథను అంచనా వేసి ఉంటారు గానీ.. అది అసలు కథ కాదని, అందులో ఎన్నెన్నో ట్విస్టులు ఉన్నాయని, సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. షారుక్ యాక్టింగ్ అదిరిపోయింది, ఒక్క సన్నివేశాం అసభ్యంగా లేదని అంటున్నారు. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ షారుక్ కమ్ బ్యాక్ ఇచ్చాడని చెబుతున్నారు.
ఓ నెటిజన్ అయితే ట్విట్టర్‌లో 'ట్రైలర్ చూసి సినిమా కథ మొత్తం తెలిసిపోయింది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. అందులో ఏమీ చూపించలేదు. ఫస్టాఫ్ మొత్తం ఎంతో గ్రిప్పింగ్‌గా, థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో మిమ్మల్ని కట్టిపడేస్తుంది. షారుక్ నటన అద్భుతంగా ఉంది' అంటూ చెప్పుకొచ్చాడు.