బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్.. ఈ పేరు వింటేనే అభిమానులకు పండగ. అమ్మాయిల మనసు దోచిన లవ్లీ మ్యాన్. నటుడిగా మూడు దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమను ఏలుతున్న ఆయన సరైన కథతో ప్రేక్షకుల్ని అలరించాలని నాలుగేళ్లుగా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం పలు సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి వరుస షూటింగ్‌లతో బిజీగా గడిపేస్తున్నారు. అందులో 'పఠాన్' సినిమా ఒకటి. అయితే నేడు షారుక్ పుట్టినరోజు సందర్భంగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల కోసం పఠాన్ మూవీ ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది.
Pathan Teaser: షారుక్ రఫ్ లుక్, దీపిక హాట్ ఎక్స్పోజింగ్.. యాక్షన్ అదుర్స్ - షారుక్ పఠాన్ మూవీ అప్డేట్స్
షారుక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా 'పఠాన్' మూవీటీమ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది. టీజర్‌ను రిలీజ్ చేసింది. ఆద్యంతం యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ టీజర్ అదిరిపోయింది. ముఖ్యంగా షారుక్ లుక్, దీపికా పదుకొణె హాట్ ఎక్స్పోజింగ్ ఆకట్టుకుంటున్నాయి.
'పఠాన్ గురించి నీకు ఏం తెలుసు?' అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఫైట్ సీక్వెన్స్‌తో యాక్షన్ ప్రియుల్ని అలరించేలా ఉంది. "మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని వేధించారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు" అనే డైలాగ్‌తో షారుక్ పాత్రను పరిచయం చేయడం.. 'బతికే ఉన్నా' అంటూ ఆయన చెప్పడం.. వంటి సీన్స్ హీరో ఫ్యాన్స్‌తో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ పఠాన్ ఎవరు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఇందులో జాన్ అబ్రహం పాత్ర ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇక షారుక్ సిక్స్ ప్యాక్ రఫ్ లుక్, దీపికా పదుకొణె హాట్ ఎక్సోజింగ్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా షారుక్-జాన్ అబ్రహం మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తంగా ఈ టీజర్ ఆద్యంతం ఓ పవర్ఫుల్ యాక్షన్ పంచ్. కాగా, ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నారు. జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుందీ మూవీ.
ఇదీ చూడండి:షారుక్ ఖాన్‌కు ఉన్న ఈ క్రేజీ అలవాటు తెలుసా రాత్రైతే అలా చేయాల్సిందేనట