సల్మాన్ ఖాన్ నేడు 57వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్ తన నివాసంలో గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. ఈ వేడుకలో బాద్‌షా షారుక్ ఖాన్ సందడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సల్మాన్-షారుక్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూసిన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు. ఇక ఈ పార్టీకి జాన్వీకపూర్,పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్‌ఆర్యన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
క్రెడిట్ కొట్టేసిన హీరోయిన్.. ఒక చిత్రం హిట్ కొట్టగానే అందులో నటించిన నటులకు వరుసపెట్టి అవకాశాలు వస్తుంటాయి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం.. చేసుకోకపోవడం వేరే విషయం. పాపం సల్మాన్‌ఖాన్.. తను హీరోగా నటించిన తొలి చిత్రం 'మైనే ప్యార్ కియా' బ్లాక్‌బాస్టర్ హిట్ కొట్టినా.. కొన్ని నెలలపాటు అతనికి ఎలాంటి అవకాశాలు రాలేదట. హిట్ ఘనతను తనకు జోడీగా నటించిన భాగ్యశ్రీ ఎగరేసుకుపోయిందని ఓ సందర్భంలో సల్మాన్ తన తొలి చిత్రం తర్వాత ఎదురైన పరిస్థితులను వివరించారు.
"మైనే ప్యార్ కియా చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. కానీ, ఆ ఘనతను భాగ్యశ్రీ కొట్టేసింది. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరూ సినిమా హిట్ కావడానికి భాగ్యశ్రీనే కారణమని, నేను ఏదో ఉన్నాను అంటే ఉన్నాననుకున్నారు. దీంతో నాలుగైదు నెలల వరకు నాకు ఒక్క అవకాశం కూడా రాలేదు. పైగా భాగ్యశ్రీ పెళ్లి చేసుకొని నటనకు దూరం కావాలని నిర్ణయించుకోవడంతో ఇక నాకు అవకాశాలే రావని బాధపడ్డాను’’అని చెప్పుకొచ్చాడు. అయితే, సల్మాన్ అలా బాధపడటం చూడలేక అతడి తండ్రి సలీం ఖాన్.. జీపీ సిప్పీ అనే నిర్మాతను పిలిచి.. సల్మాన్‌తో సినిమా తీయబోతున్నట్లు ప్రకటించమని చెప్పాడట. ఆ ప్రకటన పత్రికలు, మ్యాగజైన్‌లలో రావడంతో ఇతర దర్శకులు, నిర్మాతల నుంచి సల్మాన్‌కు ఆఫర్లు వచ్చాయి. ‘మైనే ప్యార్ కియా’ చిత్రానికి సల్మాన్ పారితోషికంగా రూ.31వేలు తీసుకోగా.. తర్వాత అతడి పారితోషికం రూ.75వేలకు పెరిగిందట.
కాగా మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్.. ఆ తర్వాత 'హమ్ ఆప్కే హై కౌన్','బీవీ నెం.1', 'కుచ్ కుచ్ హోతా హై' వంటి సినిమాలతో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే సల్మాన్‌ఖాన్‌తోపాటు హీరోయిన్ భాగ్యశ్రీ, దర్శకుడు సూరజ్ బర్జాత్యాకు కూడా మైనే ప్యార్ కియా తొలి సినిమా. సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి.. పేదింటికి చెందిన అమ్మాయి ప్రేమలో పడతారు. ఆ తర్వాత వారికి ఎదురయ్యే పరిస్థితులే కథాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం 1989 డిసెంబర్29న విడుదలైంది. కథ, పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చడంతో బ్లాక్‌బాస్టర్ హిట్ సాధించింది. అప్పటి బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా 'మైనే ప్యార్ కియా' రికార్డు సృష్టించింది.
ఇదీ చూడండి:సోహైల్‌కు ప్రపోజ్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ప్రాణం ఉన్నంత వరకు ప్రేమిస్తానంటూ..