'పఠాన్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో షారుక్ తాజాగా అభిమానులతో ముచ్చటించాడు. #ASKSRK వేదికగా ట్విట్టర్లో సరదాగా సంభాషించాడు.
'జవాన్' టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు?
షారుక్: త్వరలోనే పార్టీ జరగనుంది. అందుకోసం పటాసులు కొనడానికి మార్కెట్‌కు వెళ్లాలి.
'పఠాన్'కు పబ్లిక్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది?
షారుఖ్: డ్యాన్స్ చేశా, పాటలు పాడా, నవ్వుకున్నా.. ఎవరికి తెలుసు రేపు అనేది ఉంటుందో ఉండదో. ప్రేమతో ప్రతి విషయాన్నిసెలబ్రేట్ చేసుకుంటున్నా. 'పఠాన్' సంబరాలు చేసుకునేటప్పుడు పక్కన వాళ్లను సైతం దయచేసి దృష్టిలో ఉంచుకోండి.
'పఠాన్' చూసిన తర్వాత మీ అబ్బాయి అబ్రామ్ స్పందన ఏమిటి?
షారుక్: సినిమా చూశాక వాడు నా వద్దకు వచ్చి.. 'ఇదంతా కర్మపై ఆధారపడి ఉంటుంది' అని చెప్పాడు. దాన్ని నేను నమ్ముతున్నా.
'పఠాన్' సృష్టిస్తోన్న రికార్డులు చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుంది?
షారుక్:మళ్లీ పాత రోజులకు వెళ్లినట్లుగా ఉంది.
మీరు బయటకు ఎప్పుడు వస్తారు?
షారుక్: బ్రదర్.. ఎన్నో ఏళ్ల తర్వాత నేను థియేటర్‌కు వచ్చాను. కాసేపు ఇక్కడే ఉంటాను.
నన్ను అమ్మాయిలు ఇష్టపడటం లేదు. నాకు ఏదైనా టిప్స్ ఇవ్వండి?
షారుక్: టిప్స్ ఇచ్చేంత సమయం ఇప్పుడు లేదు.
జిమ్ (జాన్ అబ్రహం) కొడుతున్నప్పుడు 'పఠాన్'కు ఎలా అనిపించింది?
షారుక్:జిమ్ దృఢమైన వ్యక్తి. నన్ను విపరీతంగా కొట్టాడు.. ఉఫ్..!! థ్యాంక్యూ దేవుడా.. నేను సురక్షితంగా అతడి నుంచి తప్పించుకున్నా.
నా ఐదేళ్ల కుమార్తె కూడా మిమ్మల్ని 'పఠాన్'గా ఇష్టపడుతోంది..!
షారుక్: ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని ఈ పఠాన్ అంకుల్ కూడా తనని ఇష్టపడుతున్నాడని చెప్పండి.